How to Book a Bus Ticket Online | Using Mobile phone/ Desktop.. Step by Step Process here.. @eLearningBADI.in
బస్ టికెట్ ను ఆన్లైన్ లో సులువుగా బుక్ చేసుకోవడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
గమనిక: మొబైల్ ఫోన్ తో గాని/ డెస్క్ టాప్ తో గాని బస్ టికెట్ ను ఆన్లైన్లో బుక్ చేసుకునే విధానం ఒకే విధంగా ఉంటుంది.
ఆన్లైన్ లో బస్ టికెట్ బుక్ చేసుకోవడంలో సహాయం కోసం వీడియొ చూడండి.
1. బస్ టికెట్ ను ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి tsrtconline.in/ apsrtconline.in అని టైప్ చేసి సెర్చ్ చెయ్యండి.
2. డైరెక్ట్ లింక్స్ : https://www.apsrtconline.in/ https://www.tsrtconline.in/ పై క్లిక్ చేయండి.
3. అధికారిక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది.
■ Search for Bus tickets!
◆ క్రింద కనిపిస్తున్న మొదటి బాక్స్ లో మీరు ఎక్కడి నుండి మీ ప్రయాణాన్ని కొనసాగించాలి అనుకుంటున్నారో ఆ బస్టాండ్ పేరు ఎంటర్ చేయండి.
ఉదా: ఖమ్మం
◆ రెండవ బాక్స్ లో ఎక్కడి వరకు వెళ్లాలి అనుకుంటున్నారో ఆ బస్టాండ్ నేమ్ ఎంటర్ చేయండి.
ఉదా: హైదరాబాద్
4. డేట్/తేదీ ఎంటర్ చేయడానికి, క్రింద కనిపిస్తున్న అటువంటి క్యాలెండర్ గుర్తుపై క్లిక్ చేయండి. క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. తేదీ ను ఎంటర్/ఎంపిక చేయండి.
5. ఇప్పుడు కింద కనిపిస్తున్న Check Availability లింక్ పై క్లిక్ చేయండి.
6. ఇక్కడ మీరు ఎంటర్ చేసినటువంటి డేట్/తేదీ ఆధారంగా.. ఆ రోజు అందుబాటులో ఉన్న అన్ని బస్ లు కనిపిస్తాయి.
7. కనిపిస్తున్న వాటిలో నుండి మీకు అనుకూలమైన సమయంతో అందుబాటులో ఉండే బస్ ను ఎంపిక చేసుకోవడానికి ముందు, ఆ బస్ లో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, కిటికీ దగ్గర ఎన్ని సీట్లు ఉన్నాయో చూపిస్తుంది. ఇక్కడ సంబంధిత బస్ టికెట్లను బుక్ చేయడానికి Select Seets బటన్ పై క్లిక్ చేయండి.
8. బోర్డింగ్ పాయింట్: ఖమ్మం; డ్రాపింగ్ పాయింట్: హైదరాబాద్ అని కనిపిస్తుంది.
9. బస్ లేఅవుట్ చూడటానికి Show Layout బటన్ పై క్లిక్ చేయండి.
10. సంబంధిత బస్ లేఅవుట్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు బుక్ చేయాలనుకున్న సీట్ పై క్లిక్ చేసి సెలక్ట్ చేయండి. ఇలా ఒకటి కంటే ఎక్కువ కూడా సందర్భాన్ని బట్టి బుక్ చేసుకోవచ్చు. మీకు అవసరమగు సీట్లను సెలెక్ట్ చేసుకోండి.
11. బుక్ చేసుకునే వ్యక్తికి బస్ టికెట్ ను మెసేజ్ రూపంలో పొందటానికి, మెయిల్ రూపంలో పొందటానికి మీ మొబైల్ నెంబర్, మీ మెయిల్ ఐడి లను ఎంటర్ చేయండి.
12. వాటికి కిందనే కనిపిస్తున్న గడులలో (బుక్ చేసుకుంటున్న/ బుక్ చేస్తున్న వారి) మీ పేరు, జండర్, వయస్సు ఎంటర్ చేయండి.
అన్ని వివరాలు ఎంటర్ చేసిన తర్వాత Continue బటన్ పై క్లిక్ చేయండి.
13. ఇప్పుడు మీరు బుక్ చేసినటువంటి బస్ టికెట్ ప్రివ్యూ కనిపిస్తుంది. ఆన్లైన్లో Money Pay చేయడానికి క్రిందనే కనిపిస్తున్న Make Payment బటన్ పై క్లిక్ చేయండి.
14. Payment Getway పేజీ ఓపెన్ అవుతుంది.
15. సంబంధిత ఆధారాలను ఎంటర్ చేసి, Make Payment బటన్ పై క్లిక్ చేయండి.
16. సంబంధిత మొబైల్ నెంబర్ కు (One Time Password) OTP వస్తుంది. OTP ను ఎంటర్ చేసి మరల Make Payment పై క్లిక్ చేయండి.
17. Payment Success ఆని పాప్అప్ విండో షో అవుతుంది.
మీ బస్ టికెట్ విజయవంతంగా బుక్ చేయబడింది.
ఇదే సమాచారం మీ మొబైల్ నెంబర్ కు, మీ ఈ మెయిల్ ఐడి కు అందుతుంది.
బస్ ఎక్కేముందు అందుకున్న తగు సమాచారాన్ని చూపిస్తే సరిపోతుంది.
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment