APPSC Extension Officer Grade-1 Recruitment 2021 || Graduate Womens Can apply online.. || Check vacancies here..
డిగ్రీ పసిన మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.. రూ.71,500 జీతంతో తాజాగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు తప్పక దరఖాస్తు చేసుకోండి.
ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-విజయవాడ.
ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-1 (సూపర్వైజర్) పోస్టుల భర్తీకి ఆంధ్ర ప్రదేశ్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న మొత్తం 22 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేస్తూ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత కలిగినటువంటి మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన మహిళా అభ్యర్థులకు రూ.24,400/- నుండి 71,510/-వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
జూలై 1, 2021 నాటికి 18 సంవత్సరాలు నిండి 42 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి.
అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు లకు అర్హులు.
పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ ను చదవండి అధికారిక నోటిఫికేషన్ లింక్ ఈ పేజి చివరలో ఉన్నది.
దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు, ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్ సైట్ నందు వన్ టైం రిజిస్ట్రేషన్ ఆధారంగా, దరఖాస్తులు సమర్పించాలని తెలియజేశారు.
అర్హత ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు, అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తులు చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.11.2021 నుండి.
దరఖాస్తులకు చివరి తేదీ: 08.12.2021.
ఆన్లైన్లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 07.12.2021..
ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-1, సూపర్వైజర్ పోస్టులకు రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
ఈ పరీక్ష మొత్తం 300 మార్కులకు ఉంటుంది.
ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ రూపంలో పరీక్ష ఉంటుంది.
పేపర్-1 లో జనరల్ స్టడీస్& మెంటల్ ఎబిలిటీ నుండి 150 ప్రశ్నలు అడుగుతారు.
ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
పరీక్ష సమయం: 150 నిమిషాలు.
పేపర్-2 లో (కామన్ పేపర్) హోమ్ సైన్స్ & సోషల్ వర్క్ నుండి 150 ప్రశ్నలు అడుగుతారు.
ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
పరీక్ష సమయం: 150 నిమిషాలు.
ఇది కూడా చదవండి:
WDCW నుండి 275 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-II (సూపర్వైజర్) పోస్టుల భర్తీకి ప్రకటన..
పూర్తి వివరాలు దరఖాస్తు వివరాలు వీడియొలో👇...
275 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-II (సూపర్వైజర్) దరఖాస్తు విధానం వీడియొ.. మీ సంధెహాలను ఈ వీడియొ చూసి నివృత్తి చేసుకోండీ.. 👇...
APPSC Extension Officer Grade-1 పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
హోం పేజీలోని వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయండి.
ఇప్పటికే రిజిస్టర్ అయిన వారు యూజర్ ఐడి పాస్వర్డ్ ఆధారంగా లాగిన్ అయి దరఖాస్తును సమర్పించండి.
రిజిస్ట్రేషన్ చేసుకోని వారు న్యూ రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేసి, సంబంధిత వివరాలను ఎంటర్ చేసి, రిజిస్ట్రేషన్ ను విజయవంతం చేయండి.
అధికారిక వెబ్సైట్: https://psc.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
www.esarkarijob.com
ReplyDelete