How to download IFMIS Pay Slip Online using Mobile | Step by step live process here. | And also watch LIVE DEMO Video..
మొబైల్ సహాయం తో Employees IFMIS Pay Slip డౌన్లోడ్ చేసుకునే పూర్తి విధానం..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారి నెలవారి జీతాల వివరాలను (శాలరీ పేస్లిప్) డౌన్లోడ్ చేసుకునే విధానం.. కోసం ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
నెలవారి పే స్లిప్ లను డౌన్లోడ్ చేసుకోవడం వల్ల, జీతాల వివరాలు తెలుసుకోవచ్చు.. అలాగే ఆర్థిక సంవత్సరం చివరి నెలలో "ఇన్కమ్ టాక్స్" సంబంధించి "ఐటి" సబ్మిట్ చేయడం సులభతరం అవుతుంది.. ఆన్లైన్ విధానంలో ఈ శాలరీ స్లిప్ ను డౌన్లోడ్ చేసుకునే విధానం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ విధానం లైవ్ లో తెలుసుకోవడానికి ఈ వీడియోను చూడండి..
IFMIS వెబ్ పోర్టల్ ద్వారా నెలవారి శాలరీ స్లిప్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
సూచన: శాలరీ స్లిప్ లను ఈ పోర్టల్ నుండి డౌన్లోడ్ చేసుకోవడానికి, ఎంప్లాయ్ ట్రెజరీ ఐడి రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు లింక్ అయి ఉండాలి/ శాలరీ ఎకౌంట్ నెంబర్ ద్వారా కూడా డౌన్లోడ్ చేయవచ్చు. దానికోసం ఎకౌంట్ నెంబర్ కు మొబైల్ నెంబర్ లింక్(Register) అయి ఉండాలి.
1. నెలవారి శాలరీ స్లిప్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి IFMIS అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
అధికారిక వెబ్ సైట్ లింక్: https://ifmis.telangana.gov.in/
2. అధికారిక వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.
మెయిన్ మెనూ లో కనిపిస్తున్న టువంటి HOME మెనూ పక్కనే ఉన్న PAYSLIP పై క్లిక్ చేయండి.
3. ఎంప్లాయ్ పే స్లిప్ ను రెండు రకాలుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
1. ట్రెజరీ ఐడి ను ఎంటర్ చేయడం ద్వారా,
2. సాలరీ అకౌంట్ నెంబర్ ద్వారా..
4. ట్రెజరీ ఐడి ద్వారా పేస్లిప్ డౌన్లోడ్ చేసుకోవడానికి.. మీ ట్రెజరీ ఐడి ను ఎంటర్ చేసి, క్రింద కనిపిస్తున్న క్యాన్సర్ కోడ్ను ఎంటర్ చేసి, SEARCH బటన్ పై క్లిక్ చేయండి.
5. సంబంధిత ఉద్యోగి వివరాలను చూపిస్తూ, OTP సెండ్ చేయడానికి, ఆప్షన్ చూపిస్తుంది. ఓటిపి ను సెండ్ చేయడానికి SEND OTO బటన్పై క్లిక్ చేయండి.
6. సంబంధిత రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది. సంబంధిత గడిలో OTP ఎంటర్ చేసి SUBMIT పై క్లిక్ చేయండి.
7. OTP సబ్మిట్ చేయగానే, అదే పేజీలో SELECT MONTH SELECT YEAR ఆప్షన్ కనిపిస్తాయి. వాటిని ఎంపిక చేసి, Generate Payslip బటన్పై క్లిక్ చేయండి.
8. ఎంపిక చేసినటువంటి నెల, సంవత్సరం యొక్క పే స్లిప్ జనరేట్ అవుతుంది. క్రింద కనిపిస్తున్న ప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేసి, PDF రూపంలో సేవ్ చేసుకోండి.
9. ఇదేవిధంగా ప్రతి సారి నెల సంవత్సరం మారుస్తూ మీకు కావలసిన అన్ని పేస్లిప్ లను ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు..
అధికారిక వెబ్ సైట్ లింక్: https://ifmis.telangana.gov.in/
ఫేస్బుక్ డౌన్లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్: https://ifmis.telangana.gov.in/get_payslip
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మే - 2022
10వ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు కోసం IFMIS వెబ్ సైట్ లో చలానా ను ఆన్లైన్ లో జనరేట్ చేసుకునే విదనం LIVE Video







BSE తెలంగాణ వెబ్ సైట్ లో పదవ తరగతి విద్యార్థుల వివరాలను ఫోటో, సిగ్నేచర్ తో ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసే విధానం.... LIVE Demo
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
All The Best
Thank-you
D.saidulu
ReplyDelete