NIACL Recruitment 2021 | Apply 300 posts of Administrative Officers | Check eligibility details here..
భారత ప్రభుత్వ రంగానికి చెందిన ముంబైలోని 'దా న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్' వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(జర్నలిస్ట్) (స్కేల్-1) పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన పౌరులు నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది.
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. మరియు ఇరవై సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు.
వయసు: ఏప్రిల్ 1, 2021 నాటికి 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు వర్తిస్తుంది. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ ఇక్కడ చదవండి.
జీతం: బేసిక్ పే రూ.32795 నుండి రూ.62,315 వరకు ఉంటుంది. అన్ని అలవెన్స్ లతో కలిపి రూ.60,000/-వరకు ప్రతినెలా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ప్రిలిమినరీ ఈ పరీక్ష:
ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో ఉంటుంది.
దీనిని ఆన్లైన్లో నిర్వహిస్తారు.
ఇందులో మొత్తం 3 సెక్షన్లు ఉంటాయి.
అవి 1. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 30 మార్కులు.
2. రీజనింగ్ ఎబిలిటీ నుండి 35 మార్కులు.
3. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి 35 మార్కులు..
ఇలా మొత్తం 100 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్ష సమయం 60 నిమిషాలు.
పరీక్ష పేపర్ హిందీ/ ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది.
మెయిన్ పరీక్ష:
ఈ పరీక్ష ను ఆబ్జెక్టివ్ టైప్ మరియు డిస్క్రిప్టివ్ టైప్ విధానంలో నిర్వహిస్తారు.
ఇక్కడ 200 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్.
30 మార్కులకు డిస్క్రిప్టివ్ టైప్ విధానంలో నిర్వహిస్తారు.
ఇందులో మొత్తం నాలుగు సెక్షన్లు ఉంటాయి.
అవి 1. రీజనింగ్,
2. ఇంగ్లీష్ లాంగ్వేజ్,
3. జనరల్ అవేర్నెస్,
4. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్.. మొదలగునవి.
ప్రతి సెక్షన్ నుండి 50 మార్కుల చొప్పున మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు.
పరీక్షా సమయం 02:30 నిమిషాలు.
పరీక్ష పేపర్ హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటుంది.
డిస్క్రిప్టివ్ పరీక్ష: ఈ పరీక్షను 30 మార్కులకు నిర్వహిస్తారు.
లెటర్ రైటింగ్ కు 10 మార్కులు,
ఎస్సే రైటింగ్ కు 20 మార్కులు..
పరీక్ష సమయం 30 నిమిషాలు.
ఈ పరీక్షను కూడా ఆన్లైన్లో నిర్వహిస్తారు.
పరీక్ష పేపర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే ఉంటుంది.
పరీక్ష సెంటర్లు: రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ముఖ్య జిల్లాల్లో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
ఎస్సీ /ఎస్టీ /పిడబ్ల్యు డి అభ్యర్థులకు రూ.100/-
ఇతరులకు రూ.750/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.09.2021 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 21.09.2021.
అధికారిక వెబ్సైట్: https://www.newindia.co.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు వీడియొలో👇
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment