TS WDCW - తెలంగాణ మహిళలకి బంపర్ ఆఫర్.. ఇలాంటి పోస్టులు చాలా అరుదు.. తప్పక దరఖాస్తు చేయండి.
TS Govt Job Alert 2022 తెలంగాణ మహిళలకి బంపర్ ఆఫర్.. ఇలాంటి పోస్టులు చాలా అరుదు..!
నిరుద్యోగ మహిళలకి శుభవార్త..!
రాష్ట్రంలో 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి KCR గారు అసెంబ్లీలో ప్రకటించినప్పటి నుంచి వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇప్పటికే గ్రూప్ 1, పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఎస్సైలు, కానిస్టేబుల్, సింగరేణి జూనియర్ అసిస్టెంట్స్ వంటి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. తాజాగా మహిళల కోసం ప్రత్యేకంగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్-1 ఎక్స్‍టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) పోస్టుల భర్తీకి (TSPSC) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలకి మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఆసక్తి కలిగిన తెలంగాణ కు చెందిన మహిళ అభ్యర్థులు సెప్టెంబర్ 08, 2022 నుండి సెప్టెంబర్ 29, 2022 నాటికి ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారమైన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం..
మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 181పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు:
ఎక్స్‍టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) పోస్టుల వివరాలు,
కాళేశ్వరం - 26పోస్టులు
బాసర - 27పోస్టులు
రాజన్న - 29పోస్టులు
భద్రాద్రి - 26పోస్టులు
యాదాద్రి - 21పోస్టులు
చార్మినార్ - 21పోస్టులు
జోగులాంబ - 31 పోస్టులు జోన్ల వారీగా ఖాళీగా ఉన్నాయి.
విద్యా అర్హతలు:
హోమ్ సైన్స్/సోషల్ వర్క్/సోషియాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ,
లేదా ఫుడ్ సైన్స్ అండ్‌న్యూట్రిషన్/బోటనీ/జువాలజీ అండ్ కెమిస్ట్రీ/అప్లైడ్ న్యూట్రిషన్ అండ్ పబ్లిక్ హెల్త్/క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్/బయో కెమిస్ట్రీ/ఫుడ్ సైన్సెస్ అండ్ క్వాలిటీ కంట్రోల్/జువాలజీ/బోటనీ అండ్ కెమిస్ట్రీ/బయోలాజికల్ కెమిస్ట్రీ
లేదా తత్సమాన స్పెషలైజేషన్‌లో బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థులకు 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు కలిగి వుండాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీకి ఐదేండ్లు, ఎక్స్ సర్వీస్మెన్‌కు, ఎన్‌సీసీ అభ్యర్థులకు మూ డేండ్లు, దివ్యాంగులకు మరో పదేండ్ల వయోపరిమితి కలిగి ఉంది.
Govt Job Alert | 10, 12 తో 156 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన | వివరాలివే.
ఎంపిక విధానం:
ఆన్‌లైన్‌లో రాత పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం రెండు పేపర్లు ఉంటాయి.
పేపర్ -1లో 150 ప్రశ్నలు; జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ విభాగం నుండి అడుగుతారు.
పేపర్-2లో సంబంధిత డిగ్రీ సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలు; అడుగుతారు.
10th Pass Job | 10తో 108 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | పూర్తి వివరాలు..
దరఖాస్తు విధానం:
ఆన్ లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేసే సమయంలో 280/- రూపాయలు ఫీజు ను చెల్లించాలి.







దరఖాస్తు ప్రారంభ తేది:
దరఖాస్తులు సెప్టెంబర్ 08, 2022 నుండి ప్రారంభించబడుతాయి.
దరఖాస్తు చివరి తేది:
దరఖాస్తులు సెప్టెంబర్ 29, 2022 నాటికి ముగుస్తుంది.
హైదరాబాద్ లో ఖాళీలు.. AWES - PGT, TGT, PRT Teacher Job Recruitment 2022 | ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. వివరాలివే.
గౌరవ వేతనం:
బేసిక్ పే రూ.35,720 - రూ.1,04,430 మధ్య ఉంటుంది.
అడికారిక వెబ్సైట్ :: https://www.tspsc.gov.in/ & https://wdcw.tg.nic.in/
అదికరిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కకడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment