BECIL Office Attendant Recruitment 2022 | 10తో ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి BECIL భారీ ఉద్యోగ ప్రకటన..
నిరుద్యోగులకు శుభవార్త!
భారత ప్రభుత్వానికి చెందిన న్యూఢిల్లీలోని బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న BECIL కేంద్రాల్లో మొత్తం 30 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పది, ఇంటర్, డిగ్రీ అర్హతలు కలిగిన ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు, ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తును సమర్పించే పోటీపడవచ్చు.. ఆన్లైన్ దరఖాస్తులకు ఈ నెల 21(21.10.2022) చివరి తేదీ. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి:; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, విభాగాల వారీగా ఖాళీల వివరాలు.. మొదలగు పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 30.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ ఈ టెండరింగ్ ప్రొఫెషనల్ - 12,
◆ ఫైనాన్సర్ ఫెసిలిటేషన్ ప్రొఫెషనల్ - 12,
◆ ఆఫీస్ అటెండెంట్ - 6.
ఇది కూడా చదవండి :: హైదరాబాదులోని నిమ్స్ డాటా ఎంట్రీ ఆపరేటర్ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
విద్యార్హత:
పోస్టులను అనుసరించి..
◆ ఈ టెండరింగ్ ప్రొఫెషనల్ పోస్టులకు :: బీఈ/ బీటెక్.
◆ ఫైనాన్స్ ఫెసిలిటేషన్ ప్రొఫెషనల్ పోస్టులకు :: ఎంబీఏ, ఐసిడబ్ల్యూఏ, బి.కామ్, ఎంఎస్ఎంఈ.
◆ ఆఫీస్ అటెండెంట్ పోస్టులకు :: 10వ తరగతి ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. స్థానిక భాషా పరిజ్ఞానం తప్పనిసరి.
వయోపరిమితి:
పోస్టులను అనుసరించి, దరఖాస్తు తేదీ నాటికి 21 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు, పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
◆ జనరల్/ ఓబిసి/ మహిళా అభ్యర్థులకు రూ.885/-.
◆ ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్/ పిహెచ్ అభ్యర్థులకు రూ.531.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి, నోటిఫికేషన్ ప్రమాణాల ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్, రాత పరీక్ష ఇంటర్వ్యూల నిర్వహించే ఎంపిక చేస్తారు.
ఎంపికైన అభ్యర్థులు హైదరాబాదు తో సహా దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న BECIL కేంద్రాల్లో పని చేయాల్సి ఉంటుంది.
గౌరవ వేతనం:
◆ ఈ టెండరింగ్ ప్రొఫెషనల్ - రూ.50,000/-,
◆ ఫైనాన్సర్ ఫెసిలిటేషన్ ప్రొఫెషనల్ - రూ.50,000/-,
◆ ఆఫీస్ అటెండెంట్ - రూ.17,537/-. వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
అధికారిక వెబ్సైట్ :: https://www.becil.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 30.09.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 21.10.2022.
BECIL ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం ఎలా:







BECIL - పైన పేర్కొన్న టువంటి ఉద్యోగాలకు దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://www.becil.com/
◆ ఇప్పటికే రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న అభ్యర్థులు, యూజర్ ఐడి, పాస్వర్డ్ ల ఆధారంగా లాగినై దరఖాస్తులను సమర్పించవచ్చు.
◆ కొత్తగా నమోదు చేయాలనుకునేవారు, న్యూ రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేసి, వ్యక్తిగత వివరాలు మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడి లను నమోదుచేసి రిజిస్ట్రేషన్ చేసుకుని తదుపరి లాగినై దరఖాస్తులను సమర్పించవచ్చు.
◆ ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడం లో భాగంగా స్కేన్నెడ్ ఫొటోగ్రాఫ్, సిగ్నేచర్, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, పదో తరగతి నుండి సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలు అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
◆ తదుపరి దరఖాస్తు ఫీజు చెల్లించే, దరఖాస్తులను విజయవంతంగా సమర్పించండి.
◆ భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
◆ ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment