UPSC Recruitment 2021 ‖ UPSC నుండి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ నియామక పరీక్ష సీఎపీఎఫ్ - 2021, నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలివే..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ పరీక్ష - 2021. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ సీఎపీఎఫ్ - 2021 నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ కమాండెంట్ లో మొత్తం 159 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఇవి బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్ పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్ బీ మొదలైన కేంద్ర సాయుధ బలగాలు లోని అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు.
కేంద్ర సాయుధ బలగాల వారీగా ఖాళీల వివరాలు:
1.బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోన్) - 35
2.సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) - 67
3.సీఆర్ పీఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) - 36
4.ఐటీబీపీ (ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్) - 20
5.ఎస్ఎస్ బీ (సహాస్త్రా సీమ బల్) - 01 మొదలైనవి.
విద్యార్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. మరియు 2021లో డిగ్రీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు సీఎపీఎఫ్ - 2021 పరీక్షకు కావలసిన నిర్దిష్ట శారీరక ఆరోగ్య ప్రమాణాలను కలిగి ఉండాలి.
ఈ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు పైన తెలిపిన అర్హత ప్రమాణాలు కలిగి ఉన్నా స్త్రీ మరియు పురుష అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.
వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 01.08.2021 నాటికి 20 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్/ మెడికల్ టెస్ట్/ ఇంటర్వ్యూ మరియు పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపికను నిర్వహిస్తారు.
ఇది కూడా చదవండి: Bank of Baroda Recruitment 2021 ‖ బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి మొత్తం 511 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు చేయండిలా..అన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29.04.2021
పరీక్ష సెంటర్లు: తెలుగు రాష్ట్రాల వారికి హైదరాబాద్, విశాఖపట్టణం, తిరుపతి పరీక్షా కేంద్రాలుగా ఉన్నాయి.
పరీక్ష విధానం: ఈ పరీక్ష ను రెండు పేపర్లుగా విభజించారు.
పేపర్ - I సిలబస్:
జనరల్ ఎబిలిటీ మరియు ఇంటిలిజెన్స్ నుండి ప్రశ్నలు వస్తాయి.
ఈ పరీక్ష మొత్తం 250 మార్కులకు ఉంటుంది.
పేపర్ - II సిలబస్:
పేపర్ - II ను పార్ట్-A మరియు పార్టీ-B గా విభజించారు.
పార్ట్-A మొత్తం 80 మార్కులకు ఉంటుంది.
పార్టీ-B మొత్తం 120 మార్కులకు ఉంటుంది.
పేపర్ - I ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు.
పేపర్ - II మధ్యాహ్నం 02:00 నుండి సాయంత్రం 05:00 వరకు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఇది కూడా చదవండి: IGCAR Recruitment 2021 ‖ ఐజీసీఏఆర్ నుండి మొత్తం 337 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14.05.2021
దరఖాస్తు ఫీజు: రూ. 200/-
SC/ ST మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.04.2021
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించడానికి చివరి తేదీ: 05-05-2021.
అధికారిక వెబ్ సైట్ లింక్: https://www.upsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్:👇
ఇది కూడా చదవండి: SVNIRTAR Recruitment 2021 ‖ స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రెయినింగ్ అండ్ రీసెర్చ్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..దరఖాస్తుకు చివరితేదీ: 06.05.2021
Comments
Post a Comment