Income tax Indian Launch New e-Filing Portal @incometax.gov.in Get Full details here..
పన్ను చెల్లింపుదారులకు ఇన్కమ్ టాక్స్ ఆఫ్ ఇండియా మెరుగైన సేవలు అందించడానికి ఆదాయపన్ను (ఐటీ) ఐటీ శాఖ జూన్ 7, 2021 న కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకు రానున్నది.
పాత ఇ-ఫైలింగ్ పోర్టల్ www.incometaxindiaefiling.gov.in, అడ్రస్..
కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్ www.incometax.gov.in జూన్ 7, 2021 నుంచి అందుబాటులోకి వస్తుందని ఇన్కమ్ టాక్స్ ఇండియా డిపార్ట్మెంట్ తమ వినియోగదారులకు ముందుగా తెలియపరిచింది. ఈ కొత్త హోటల్ సహాయంతో వినియోగదారులు మరింత సులువుగా, సౌకర్యవంతంగా పన్ను చెల్లింపులు, రిటర్నులు చేయగలుగుతారని ఐటీ శాఖ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తుంది.
సూచన: ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి పాత ఇ-ఫైలింగ్ పోర్టల్ ను దశలవారీగా నవీకరణలు చేస్తున్నామని, వచ్చేనెల ప్రారంభం నుండి అనగా జూన్ 1 నుంచి ఆరవ తేదీ వరకు ఆరు రోజులపాటు ఈ పోర్టల్ అందుబాటులో ఉండదని ఇన్కమ్ టాక్స్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలికి తెలియపరిచింది.
కొత్త ఇ-ఈ ఫైలింగ్ పోర్టల్ 2.0 ప్రయోజనాలు:
1. యూజర్ ఫ్రెండ్లీ మరియు మొబైల్ పెండ్లి హోటల్ గా ఉంటుంది.
2. సులభతరమైన దశలవారీ మార్గనిర్దేశం - యూజర్ మాన్యువల్ & సంబంధిత వీడియోలతో ఉంటుంది.
3. హెల్ప్ డెస్క్ సపోర్ట్ & చాట్ బాట్ అందుబాటులో ఉంటాయి.
4. ముందుగానే పూర్తిచేసిన ఫారాలు మరియు సరళీకృత ఐటిఆర్ యుటిలిటీ అందుబాటులో ఉంటుంది.
5. మొబైల్ యాప్ ద్వారా యూజర్ల సేవలను ఉపయోగించుకోవచ్చు.
6. వ్యక్తిగత లాగిన్ సురక్షితమైనది మరియు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి.
7. ఆన్ - పోర్టల్ పన్ను చెల్లింపుల కోసం మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి.
8. ముందుగానే పూర్తిచేసిన ఫారాలు మరియు సరళీకృత ఐటీఆర్ యుటిలిటీ ఉపయోగించుకోవచ్చు.
పాన్ ను ఆధార్ తో లింక్ చేయడానికి. ముందు ఈ వీడియొ ను తప్పక చూడండి.
IncomeTax e-Filing | After e-PaymentTax | ఈ-ఫైలింగ్ తరువాత మిగిలిన ట్యాక్స్ ను ఆన్లైన్ లో ఈ-పే చేయడం👇
ఆదాయ, వ్యయాలపై డేగ కన్ను..
ఆదాయ డిక్లరేషన్, పన్ను చెల్లింపులు, రిటర్న్ లకు సంబంధించిన నిబంధనలు ప్రతి సంవత్సరం మారుతున్నాయి. కొత్త నిబంధనలు వచ్చినప్పుడల్లా కొన్ని తికమకలు సహజం. మీ ఆదాయం పన్ను స్లాబుల కు అనుగుణంగా ఉన్నప్పుడు స్టాండర్డ్ డిటెక్షన్, సేవింగ్ పోను మిగతా ఆదాయానికి పన్ను చెల్లించక తప్పదు. ప్రస్తుతం ప్రతి అకౌంట్, దాదాపు ప్రతి లావాదేవిలు పాన్ కార్డు తో లింక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదాయాన్ని ఉన్నది ఉన్నట్లు చూపించకపోయినా.... లేక మీ వ్యయాలు, లావాదేవీలకు తగ్గట్టుగా ఆదాయ డిక్లరేషన్ లేకపోయినా ఆదాయపు పన్ను శాఖకు సులభంగానే తెలిసిపోతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆదాయ, వ్యయాలను జాగ్రత్త గా డిక్లేర్ చేయడం మంచిది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వేతనం, క్యాపిటల్ గెయిన్ డివిడెండ్, వడ్డీ ఆదాయం తో పాటు ఇతర ఆదాయాలను కూడా రిటర్న్ లో చూపించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఆయా సంస్థలు మీకు ఎంత చెల్లిస్తున్నాయన్న వివరాలను మీ కంటే ముందుగానే ఆదాయపు పన్ను శాఖకు అందజేస్తాయి. కనుక ఆ వివరాలను మీరు తప్పనిసరిగా పొల్లుపోకుండా డిక్లేర్ చేయాల్సి ఉంటుంది.
ఫామ్ 26 ఏఎస్... పన్ను పాస్ బుక్:
మీ పాన్ నెంబర్ తో జరిగిన లావాదేవీల అన్నింటిని పామ్ 26 ఏఎస్ రికార్డు చేసి ఉంచుతుంది. ఇది ఆదాయపన్ను శాఖకు చెందిన ఈ-ఫైలింగ్ పోర్టల్ లో అందుబాటులో ఉంటుంది. మీ ఫోన్ నెంబర్ మీద మీకు వచ్చిన చెల్లింపుల లో జరిగిన ట్యాక్స్ డిడక్షన్స్ అన్నింటిని ఇది రికార్డు చేస్తుంది. మరోరకంగా చెప్పాలంటే మీ టీడీఎస్ లన్ని ఇందులో రికార్డు అవుతాయి. ఈ పాన్ ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఆదాయ పన్నులను దాఖలు చేయడం సులువవుతుంది.
మీ పాన్ కార్డ్ అతిపెద్ద సాక్ష్యం:
మీరు జరిగితే అధిక విలువైన లావాదేవీలు ఎప్పటికప్పుడు ఆదాయ పన్ను శాఖ దృష్టికి వచ్చేలా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. (రూ.50,000/-) యాభై వేలకు మించి నగదు డిపాజిట్లపై పాన్ నెంబర్ వేయడం అన్ని బ్యాంకుల్లోనూ తప్పనిసరి. తద్వారా ఆ డిపాజిట్ ఆదాయపన్ను శాఖ దృష్టికి చేరిపోతుంది. అలాగే (రూ.10,00000/-) పది లక్షకు మించి నా డిపాజిట్లు ఏ రూపంలో వచ్చినా.... వాటి పూర్తి వివరాలను బ్యాంకులు విధిగా ఆదాయపన్ను శాఖకు తెలియజేయాలి. దీనికితోడు మీరు ఫిక్స్ డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు, డిబెంచర్లు ఇతర పెట్టుబడి సాధనాల్లో (రూ.10,00000/-) పది లక్షలకు మించి పెడితే ఆ వివరాలన్నీ సదరు సంస్థ నుంచి ఆదాయపు పన్ను శాఖకు వెళ్తాయి. అలాగే ప్రాపర్టీ కొనుగోళ్ల వివరాలు కూడా రిజిస్టర్ కార్యాలయం ఐటీ శాఖకు చేరిపోతాయి. పెట్టుబడులపై క్యాపిటల్ గెయిన్ ఎలాగూ పాన్ కార్డు తో లింక్ అయి ఉంటాయి కనుక అవి కూడా ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. ఈ వివరాలన్నీ పామ్ 26 ఏఎస్ లో ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఆదాయ, వ్యయాల్లో ప్రతి పైసాకు పాన్ కార్డ్ అతిపెద్ద సాక్ష్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫామ్ 26 ఏఎస్ ను డౌన్లోడ్ చేసుకుని పరిశీలించడం మంచిది. తద్వారా మీ ఆదాయ, వ్యయాల్లో తేడాలు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవచ్చు.
ఎవరు ఏ రిటర్నులు దాఖలు చేయాలి:
ఐటీఆర్-1:
వేతనం ద్వారా ఆదాయం పొందే వ్యక్తులు (దేశంలో నివసించే వారు) లేదా, మరియు ఒక ఇల్లు కలిగి ఉండి.. వ్యవసాయ ఆదాయం రూ.5,000/- వేల లోపు కలిగినా... ఇతర ఆదాయం (వడ్డీ ఆదాయం) ఉన్నా... అంతా కలుపుకొని సంవత్సర ఆదాయం రూ. 50 లక్షల లోపు ఉన్నవారు ఐటీఆర్-1 దాఖలు చేయాల్సి ఉంటుంది.
మినహాయింపులు:
పైన చెప్పుకున్న వారికి కొన్ని మినహాయింపులు వర్తిస్తాయి. ఎలా అంటే.. రూ. 50 లక్షల లోపు ఆదాయం ఉన్న వ్యక్తి ఒకవేళ ఏదైనా కంపెనీ బోర్డులో డైరెక్టర్ గా ఉన్నా లేదా ఏదైనా అన్ లిస్టెడ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ఐటిఆర్-1 దాఖలు చేయకూడదు. అదేవిధంగా సెక్షన్ 194 ఎన్ కింద టీడీఎస్ మినహాయించినా లేదా ఈ పాస్ పై పనులు వాయిదా వేసుకున్న వారు కూడా ఐటీఆర్-1 దాఖలు చేయడానికి లేదు. ఇంటిపై నష్టాలను క్యారీ ఫార్వర్డ్ చేసుకునేవారు.. ఇతర వనరుల రూపంలో నష్టాన్ని కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకునే వారు సైతం ఐటీఆర్-1 చేయరాదు.
ఐటీఆర్-2:
ఐటీఆర్-1 దాఖలు చేసే అర్హత లేని వ్యక్తులు (ఎన్ఆర్ఐ సైతం), హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్ యూఎఫ్) ... వ్యాపారం లేదా మూర్తి రూపంలో ఆదాయం, లాభాలు లేనట్లయితే ఐటీఆర్-2 దాఖలుకు అర్హులు.
ఐటీఆర్-3:
వ్యక్తులు, హెచ్ యూఎఫ్ వ్యాపారం లేదా వృత్తి నుండి ఆదాయం, లాభాలు కలిగి... ఇతర రూపాల్లో ఆదాయం లేనట్లయితే అప్పుడు ఐటీఆర్-3 దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఐటీఆర్-4:
వృత్తి, వ్యాపార ఆదాయం కలిగిన వ్యక్తులు, సంస్థలు ఐటీఆర్-4 ను దాఖలు చేయాలి. సెక్షన్ 44 ఏడీ క్రింద వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయంపై ప్రెసంప్టివ్ టాక్స్ ను ఎంపిక చేసుకున్న వ్యక్తులు (స్థానిక నివాసులు),హెచ్ యూఎఫ్ లు, సంస్థలు (ఎల్ఎల్ పీ కానివి) రూ. 50 లక్షల వరకు వార్షిక ఆదాయం కలిగి ఉంటే ఐటీఆర్-4 ను దాఖలు చేయాలి.
ఐటీఆర్-5/6/7:
ప్రత్యేక విభాగం కిందకు వచ్చే వ్యక్తులు (పై విభాగాల్లోకి రానివారు), ఎల్ఎల్పీలు, సంస్థలు, కంపెనీలు ఐటీఆర్-5/6/7 వర్తిస్తాయి.
(ప్రెసంప్టివ్ ట్యాక్స్: వృత్తి నిపుణులు లేదా సంస్థలు వార్షిక టర్నోవర్ రూ. 50 లక్షల వరకు ఉంటే ప్రెసంప్టివ్ ట్యాక్స్ స్కీమ్ ఎంచుకుని తన టర్నోవర్ 50% పన్ను వర్తించే ఆదాయం కింద చూపించి పన్ను చెల్లించే సౌలభ్యత ఉంది.)
Comments
Post a Comment