అంగన్వాడి టీచర్ల నోటిఫికేషన్, 15 వేల పోస్టులు భర్తీ. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గ్రీన్ సిగ్నల్.. వివరాలు.
త్వరలో 15 వేల ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్..
అంగన్వాడీల్లో త్వరలో 15 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు నిన్న వివిధ జిల్లాల్లో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ కార్యక్రమాల్లో మాట్లాడుతూ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే వివిధ జిల్లాల్లోని IDOC కార్యాలయంలో "పోషణ్ పక్వాడ్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీలు ఆశా కార్యకర్తల వేతనాల పెంపు విషయంపై కూడా దృష్టి పెట్టామన్నారు. కారుణ్య నియామకాల విషయంపై పరిశీలనలు చేస్తున్నామని పోలీసు శాఖ తరహాలో అంగన్వాడీలకు కూడా ఒకే రకమైన డిజైన్ యూనిఫామ్ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 37 వేల సెల్ఫోన్లను అంగన్వాడీలకు సరఫరా చేసామన్నారు. అంగన్వాడీ సమస్యల విషయంలో జిల్లా నుంచి 5 నుండి పదిమంది ప్రతినిధులు వస్తే సమయం కేటాయిస్తామన్నారు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
రాష్ట్రవ్యాప్తంగా 14,236 పోస్టులను గుర్తించినట్లు అందులో అంగన్వాడీ టీచర్ల ఖాళీలు 6,399 హెల్పర్ పోస్టులు 7837 ఉన్నాయన్నారు. ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఖాళీలకు రిజర్వేషన్ల ఖరారు చేసిన తర్వాత జిల్లా కలెక్టర్లు ఆ మేరకు ప్రకటనలు విడుదల చేసి పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నది. అయితే ఈ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళ ఔత్సాహికులకు నిరాశ మిగులుతూ వస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని, ఇందులో అంగన్వాడీ టీచర్ కేటగిరిలో మరియు హెల్పర్ కేటగిరిలో పైన తెలిపిన విధంగా ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్ కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శిస్తూ ఉండండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
































%20827%20Vacancy%20Notification%202026.jpg)



















Comments
Post a Comment