TGRJC CET & KGBV హాల్ టికెట్లు విడుదల, విద్యార్థులు ఈ స్టెప్స్ ఫాలో అవుతూ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి.
TGRJC CET & KGBV Hall Tickets Released..
తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ హైదరాబాద్, గగన్ విహార్, 4వ అంతస్తు నాంపల్లి నుండి విద్యార్థులకు రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన, మరియు రక్త పరీక్షా నిర్వహించే వివరాలను/ తేదీ పరీక్ష సెంటర్లు తెలియపరచడం కోసం పత్రిక ప్రకటన విడుదల.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలలో విద్యా సంవత్సరం 2026-27 కు గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (ఇంగ్లీష్ మీడియం - M.P.C/ Bi.P.C/ M.E.C/ C.E.C) గ్రూపులో రాష్ట్ర వ్యాప్తంగా 35 తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలలో మరియు 93 KGBV కళాశాలలో ప్రవేశం కోసం మొత్తం 76173 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాత పరీక్ష మార్చి 03, 2026 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించనున్నారు. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన లింక్ ఈనెల 27వ తేదీ నుండి అందుబాటులోకి వస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు.
అలాగే విద్యార్థులకు పరీక్ష తేదీకి ముందుగానే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలకు పరీక్ష సెంటర్లను మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, హనుమకొండ, ఖమ్మం, నల్గొండ, సిద్దిపేట, మరియు సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో 320 పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు.
పరీక్ష తేదీ: 03.05.2026 నాడు ఉదయం 9 గంటలకు పరీక్ష కేంద్రాన్ని చేరుకోండి. OMR ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. ఆన్సర్ సీటును బాల్ పాయింట్ పెన్నుతో మాత్రమే సరియుగ జవాబును నిర్దేశించిన వృత్తాలలో పూర్తిగా నింపవలెను. అలాగే హాల్ టికెట్ లో పొందుపరిచిన సూచనలను తప్పక అనుసరించండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
TGRJC CET & KGBV హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఏ క్రింది దశలను అనుసరించండి.
- ముందుగా అధికారిక వెబ్సైట్ :: https://tgrjc.cgg.gov.in/ ను సందర్శించండి.
- Home పేజీలోని Services క్రింద కనిపిస్తున్న Download Hall Tickets లింక్ పైకి లిఫ్ట్ చేయండి.
- హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన వివరాలు నమోదు చేయడానికి పేజీ ఓపెన్ అవుతుంది.
- అడిగిన వివరాలు, అప్లికేషన్ ఫామ్ చూస్తూ నమోదు చేసి, బటన్ పై క్లిక్ చేయండి.
- హాల్ టికెట్ ప్రివ్యూ స్క్రీన్ పై కనిపిస్తుంది.
- డౌన్లోడ్ చేసుకోండి.
నేరుగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
TGRJC CET నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
KGBV CET నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.

















































Comments
Post a Comment