KGBV TGRJC CET 2026: కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలు హైదరాబాద్ తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. Application Form
KGBV TGRJC CET 2026 Notification Application Link : తెలంగాణ కస్తూర్బా గాంధీ జూనియర్ కాలేజ్ ప్రవేశ పరీక్ష ప్రకటన.... దరఖాస్తులు ఆహ్వానం.
మార్చి/ ఏప్రిల్ 2026 లో 10వ తరగతి పరీక్షకు హాజరవుతున్న తెలంగాణ 33 జిల్లాల విద్యార్థులకు శుభవార్త !
తెలంగాణ రాష్ట్ర కస్తూర్బా గాంధీ జూనియర్ కాలేజీలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఇంగ్లీష్ మీడియం (MPC/BPC/CEC) లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.
KGBV TGRJC CET - 2026 ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల.
తెలంగాణ కస్తూర్బా గాంధీ విద్యాలయ సంస్థ హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ జూనియర్ కాలేజీలో ప్రవేశం కొరకు KGBV TGRJC CET - 2026 ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో, అనగా; మార్చి/ ఏప్రిల్ 2026 లో 10వ తరగతి పరీక్షకు హాజరవుతున్న తెలంగాణలోని అన్ని 33 జిల్లాల విద్యార్థినీ విద్యార్థులు జూనియర్ కాలేజ్ ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 16.03.2026 నుండి 15.04.2026 వరకు సమర్పించవచ్చు. ప్రవేశ పరీక్షలు ప్రతిభ కనబరిచిన వారికి సీట్లను కేటాయిస్తారు. ఈ ప్రవేశ ప్రకటన పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 94 జూనియర్ కస్తూర్బా గాంధీ కళాశాలలో ఉన్నాయి. జిల్లాల వారీగా కాలేజీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
తెలంగాణ రాష్ట్ర కస్తూర్బా గాంధీ జూనియర్ కళాశాలలు క్రింది చూపబడిన అన్ని మౌలిక సదుపాయాలు కలిగి ఉన్నాయి. అవి.
- ప్రయోగశాలలు, లైబ్రరీలు, రీడింగ్ రూమ్ మరియు చక్కటి భౌతిక వసతులతో ఆట మైదానం.
- ప్రవేశం పొందిన విద్యార్థులకు ఉచిత బోర్డింగ్ మరియు వసతితో ఉచిత విద్యను అందిస్తారు.
- ఎంపికైన అభ్యర్థులకు పై సౌకర్యాలు అందించబడతాయి.
- ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.
- NEET, JEE - MAIN, ADVANCED కోర్సులకు శిక్షణలు ఇస్తారు.
అర్హత ప్రమాణాలు :
- విద్యార్థి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి.
- మార్చి/ ఏప్రిల్ 2026లో 10వ తరగతి పరీక్షలు మొదటి అటెంప్ట్ లో అర్హత సాధించి ఉండాలి.
- English సబ్జెక్టులో కనీసం 4 GPA తో ఉత్తీర్ణత సాధించగలగాలి.
రాత పరీక్షలు క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు.
- ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాలలో ఉంటుంది.
- పరీక్షా సమయం (2.5) రెండున్నర గంటలు.
- మల్టిపుల్ ఛాయిస్ విధానంలో మొత్తం 150 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
- పదవ తరగతి సిలబస్ అనుగుణంగా ప్రశ్నలు అడుగుతారు.
- సమాధానాలను ఓఎంఆర్ సీట్ పై బాల్ పెన్ తో బబ్లింగ్ చేయాలి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష లో ప్రతిభ కనబరిచిన మార్కుల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
- ఎంపికైన అభ్యర్థుల జాబితా ముందుగా అధికారిక వెబ్సైట్ నందు ప్రచురింపబడుతుంది. తదుపరి అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో కౌన్సిలింగ్ నిర్వహించి సీట్ అలాట్మెంట్ చేస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : రూ.200/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 16.03.2026,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :15.04.2026.
ప్రవేశ పరీక్ష తేదీ :
- 03.05.2026 ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహిస్తారు.
అధికారిక వెబ్సైట్ : https://tgrjc.cgg.gov.in/TGRJCWEB/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment