Govt JOBs Alert - 2022 | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ | వీరికి మాత్రమే ఈ అవకాశం మిస్ అవ్వకండి..
న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వానికి చెందిన మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ గ్రీవెన్స్ & పెన్షన్ సిబ్బంది మరియు శిక్షణ విభాగం స్టాప్ సెలక్షన్ కమిషన్, జూనియర్ ఇంజనీర్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ మరియు క్వాలిటీ సర్వేయింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న వివిధ కేంద్ర ప్రభుత్వ భారీ వేతనంతో కూడిన ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించి ఎంపిక చేయడానికి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 12వ తేదీ (ఆగస్టు 12, 2022) నుండి ప్రారంభమై, సెప్టెంబర్ 2 2020 20 ముగియనుంది. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి సెప్టెంబర్ 3 నుంచి వరి తేదీన నిర్ణయించారు. అదేవిధంగా సెప్టెంబర్ 4వ తేదీ నుండి ఆన్లైన్ దరఖాస్తులో సవరణలకు అవకాశాన్ని కూడా, కల్పిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో ప్రకటించారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాతపరీక్ష కంప్యూటర్ బేస్డ్ టైప్లో నవంబర్లో నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగం నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
పోస్టుల వివరాలు:
◆ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO),
◆ సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్(CPWD),
◆ సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్,
◆ సెంట్రల్ వాటర్ కమిషన్,
◆ డైరెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్(నావెల్),
◆ Farakka Barrage Project(FBJ),
◆ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్(MES),
◆ నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(NTRO),
◆ మినిస్టరీ ఆఫ్ స్పోర్ట్స్, షిప్పింగ్ & వాటర్వేస్ (అండమాన్ లక్షద్వీప్ హారబోర్ వర్క్స్).
★ పై అన్ని రకాల పోస్టుల్లో
జూనియర్ ఇంజనీర్ (సివిల్),
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్),
జూనియర్ ఇంజనీర్ (మెకానికల్).. విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ విభాగాల్లో ఇంజనీరింగ్/ డిప్లమా అర్హత కలిగి, భారతీయ అభ్యర్థులై ఉండాలి.
వయో-పరిమితి:
జనవరి 1 2020 2 నాటికి 30 నుండి 32 సంవత్సరాలకు మించకుండా ఉండాలి, అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు నోటిఫికేషన్ ను చదవండి.
ఎంపిక విధానం:
◆ రాత పరీక్ష, ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
◆ రాత పరీక్ష పేపర్-1 కంప్యూటర్ బేస్డ్ రూపంలో మరియు పేపర్-2, రూపంలో నిర్వహిస్తారు.
◆ నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
◆ ప్రతి తప్పు సమాధానానికి 0.25 మా కోత విధిస్తారు.
పరీక్ష సెంటర్ల వివరాలు:
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని ముఖ్య జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
గౌరవ వేతనం:
ఈ జూనియర్ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం బేసిక్ పే ₹.35,400/- నుండి ₹.1,12,400/-వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు ₹.100/-.
ఎస్పీ ఎస్టీ దివ్యాంగులకు మరియు అన్ని తరగతుల మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.08.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 02.09.2022.
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://ssc.nic.in/







ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడం ఎలా?.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ ముందుగా అభ్యర్థులు అధికారిక SSC వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ తదుపరి హోం పేజీలోని రిక్రూట్మెంట్ అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయండి.
◆ అవసరమైన అర్హత ధ్రువపత్రాలు అనగా ఫోటో సిగ్నేచర్ లాంటివి అప్లోడ్ చేసే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి.
◆ తదుపరి ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించే అప్లికేషన్ ఫామ్ ను విజయవంతంగా సమర్పించాలి.
◆ అప్లికేషన్ విజయవంత సమర్పణ అనంతరం ప్రింట్ తీసుకుని భవిష్యత్ కార్యాచరణ కోసం భద్రపరుచుకోండి.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment