e-Shram portal registrations 2021 | Ministry of Labour and Employment Started Registrations | Registration direct link | e-Shram card benefits and more details check here...
ఇ-శ్రమ్ పోర్టల్ రిజిస్ట్రేషన్ ప్రారంభమై 5 వసంతాలు..
- ఇప్పటికే 31.89 కోట్ల మంది అసంఘటిత కార్మికులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు..
- దేశం లోనే ప్రథమ ఆధార్-దృవీకరించబడిన జాతీయ డేటాబేస్ https://www.eshram.gov.in/
- ఈ పోర్టల్ లో నమోదు చేసుకోవడం ద్వారా ప్రమాదవశాత్తు మరణం మరియు శాశ్వత వైకల్యానికి రూ.2 లక్షలు మరియు పాక్షిక వైకల్యానికి రూ.1 లక్ష చెల్లిస్తారు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తులు ఆహ్వానం.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులు దరఖాస్తులు చేసుకోవాలని కార్మిక శాఖ అధికారి బిఎఫ్ రాజు తెలిపారు. అన్ని జిల్లా, మండల పరిధిలోని కామన్ సర్వీస్ సెంటర్లు, మీ సేవ సెంటర్ లో కార్మికులు ఆధార్ కార్డ్ బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్స్ కాపీలు సెల్ నెంబర్ తో ఇస్తే ఉచితంగా సభ్యత్వం నమోదు చేస్తారన్నారు. ఈ పోర్టల్ లో పేరు నమోదు అయిన వెంటనే యు ఏ ఎస్ కార్డు మంజూరు అవుతుందన్నారు. ఈ పథకంలో చేరడానికి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులని పేర్కొన్నారు.
ఈ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవడానికి ఎవరు అర్హులు?.
భవన నిర్మాణ కార్మికులు, వలస కార్మికులు, వీధి విక్రేతలు, గృహ కార్మికులు, పాల కార్మికులు, ట్రక్ డ్రైవర్లు, మత్స్యకారులు, వ్యవసాయ కార్మికులు మరియు ఇలాంటి ఇతర కార్మికులు అర్హులు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
కూలీలు, కార్మికుల కోసం ఇ-శ్రామ్:
కన్స్ట్రక్షన్ వర్కర్లు, వలస కార్మికులు, వీధి వ్యాపారులు, పనిమనుషులు, కార్మికుల, కూలీల వంటి అసంఘటిత కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇ- శ్రామ్ పోర్టల్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి ఉపేందర్ యాదవ్ మాట్లాడుతూ అసంఘటిత రంగంలోని 38 కోట్ల మంది కార్మికుల వివరాలను సేకరించి డాటాబేస్ తయారు చేశామని ప్రకటించారు. ఫలితంగా వీళ్ళు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను, వివిధ వివిధ ప్రయోజనాలను పొందగలుగుతారు అని చెప్పారు ఈ పోర్టల్ ద్వారా రాష్ట్రాలు ట్రేడ్ యూనియన్లు ఒక్కతాటిపైకి తెచ్చి కార్మికులకు అన్ని సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్తకోటలో కార్మికుల వివరాలు రిజిస్ట్రేషన్ కార్మిక మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు.... కార్మిక సంఘాలు సాయంతో ఉమ్మడి సేవా కేంద్రాల (సీఎస్సీల) ద్వారా నిర్వహిస్తాయి. ప్రతి కార్మికుడికి ప్రత్యేకమైన 12 అంకెల నెంబరు గల ఇ-శ్రామ్ కార్డులు ఇస్తారు. రిజిస్ట్రేషన్ ఉచితంగానే చేస్తారు, కార్మికులకు దేశమంతటా గుర్తింపు ఉంటుంది. అన్ని సెగ్మెంట్లోని కార్మికులు తమ ఆధార్ నెంబర్, బ్యాంకు ఖాతా వివరాలు మొదలైన వాటి సహాయంతో ఈ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు..
ఇ-శ్రామ్ ఈ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ ప్రారంభమైందని కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరిన్ని వివరాలు పొందడానికి టోల్ ఫ్రీ నెంబర్ '14434' కు ఫోన్ చేయవచ్చు..
రిజిస్ట్రేషన్ వల్ల లాభాలు:
రిజిస్టర్ అయిన అన్ ఆర్గనైజ్డ్ కార్మికులందరికీ ఒక సంవత్సరం పాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పిఎంఎస్బివై) ద్వారా ప్రమాద భీమా కవరేజ్ అవుతుంది ప్రమాదవశాత్తు మరణించిన, శాశ్వత వైకల్యం వస్తే రూ.2 లక్షలు చెల్లిస్తారు. కొంత వైకల్యం ఉన్నట్లయితే రూ.1 లక్ష ఇస్తారు. కార్మికులు ఇ-శ్రామ్ పోర్టల్ ద్వారా యూనియన్, రాష్ట్ర సామాజిక భద్రతా ప్రయోజనాలను కూడా పొందవచ్చు. వైపరీత్యాలు లేదా మహమ్మారి వచ్చినప్పుడు అర్హులైన కార్మికులందరికీ సహాయం అందించడానికి పోర్టల్ లోని వివరాలను ట్రేడ్ యూనియన్లు, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకుంటాయి.
ఇ-శ్రామ్ పోర్టల్ లో సులభంగా రిజిస్టర్ అవ్వండి ఇలా..
1. ఏదైనా ఇంటర్నెట్ బ్రౌజర్ లో ని సెర్చ్ బార్ లో ఇ-శ్రామ్ హోటల్ పేజ్ అడ్రస్ ని టైప్ చేయండి.
అధికారిక వెబ్ సైట్ లింక్: https://www.eshram.gov.in/
2. హోం పేజీలో కనిపిస్తున్న అటువంటి ఇ-శ్రామ్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి.
3. ఇ-శ్రామ్ పోర్టల్ రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన సమాచారం 1. ఆధార్ నెంబర్, 2. ఆధార్ లింక్ చేయబడిన యాక్టివ్ మొబైల్ నెంబర్, 3. బ్యాంకు ఖాతా వివరాలు అవసరం అవుతాయి... వాటిని ఎంటర్ చెయ్యండి.
4. ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి, క్రింద కనిపిస్తున్న టువంటి క్యాప్షన్ ఎంటర్ చేసి సెండ్ వాటిపై క్లిక్ చేయండి.
5. రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు వచ్చినటువంటి ఓటిపి ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
6. ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ ఎకౌంట్ నెంబర్ లను ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి..
అధికారిక వెబ్సైట్: https://www.eshram.gov.in/
రిజిస్టర్ అవ్వడానికి డైరెక్ట్ లింక్: https://register.eshram.gov.in/#/user/self
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



















Comments
Post a Comment