University of Hyderabad || యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. పూర్తి వివరాలు ఇవే..
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 04,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు, విద్యార్హతలు, జీతం మొదలగు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
తప్పక చదవండి: UPSC NDA NA Recruitment 2021 || యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ - 2021. దరఖాస్తులకు చివరి తేదీ: 29.06.2021
1. ప్రోగ్రాం మేనేజర్లు: 03 పోస్టులు.
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్/ ఎంబీఏ లేదా ఫైనాన్స్ మేనేజ్మెంట్ అనుభవంతో డాటాఎంట్రీ, ఆర్గనైజేషన్, మెయింటెనెన్స్, షేరింగ్ ఫైల్/ డాక్యుమెంట్ మరియు ఇంటర్నెట్ టెక్నాలజీ, ఇంగ్లీష్ లో మాట్లాడడం, వ్రాయడం తప్పనిసరి.
విధులు మరియు బాధ్యతలు: విద్యార్థుల విషయాలు, సెక్రటేరియట్ అవసరాలు, డైరెక్టరేట్, ఫ్యాకల్టీ అండ్ ప్రాజెక్ట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వెబ్ సైట్ నిర్వహణ విధులను నిర్వహించాలి.
జీతం: ప్రతి నెల రూ.35,000/-చెల్లిస్తారు.
2. ఆఫీస్ అటెండెంట్: 01 పోస్ట్.
విద్యార్హత: సెకండరీ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణతతో పాటు ఆఫీస్ అటెండెంట్ గా రెండు సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి. ఇంగ్లీష్ చదవడం రాయడం తప్పనిసరి.
విధులు మరియు బాధ్యతలు: కార్యాలయం తెరిచి శుభ్రంగా ఉంచడం, ఫైళ్లను క్రమ పద్ధతిలో, వ్యవస్థీకృత మార్గంలో ఉంచడం. మొదలగు విధులు బాధ్యతలను నిర్వర్తించాలి.
జీతం: ప్రతి నెల రూ.15,000/-చెల్లిస్తారు.
తప్పక చదవండి: HCL Non Executive Recruitment 2021 || హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తులకు చివరి తేదీ: 15.07.2021.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను పోస్టు ద్వారా పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 25.06.2021
చిరునామా: ద డైరెక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏమి నేమ్స్, ఇఓఈ డైరెక్టరేట్, డాక్టర్ జాకీర్ హుస్సేన్ యూపీఈ లెక్చర్ హాల్ కాంప్లెక్స్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ప్రొఫెసర్ సీఆర్ రావు రోడ్డు గచిబౌళి, హైదరాబాద్-500046.
అధికారిక వెబ్సైట్: https://uohyd.ac.in/
అధికారిక నోటిఫికేషన్:
అప్లికేషన్ ఫామ్:
Comments
Post a Comment