Scholarship for AY 2022-23 info | ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్ కొరకు దరఖాస్తు విధానం..
విద్యార్థిని విద్యార్థులకు శుభవార్త!.
చదువుకోవాలని కోరిక ఉండి, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉన్నత చదువులకు దూరమవుతున్న విద్యార్థిని విద్యార్థులకు తమ వంతు చేయూత అందించడానికి, భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ స్కాలర్షిప్ పథకం ద్వారా సహాయం అందుకోవడానికి భారతదేశంలో విద్యాభ్యాసం చేసేందుకు 'SC' కి చెందిన విద్యార్థుల నుండి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. 2022-23 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు చేసుకోవడానికి, దరఖాస్తు ఫామ్ ఏప్రిల్ 14 2022 నుండి ' నేషనల్ స్కాలర్షిప్' పోర్టల్ లో అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు స్కాలర్షిప్ పథకం కోసం అర్హులు. ఎంపికైన వారికి ఈ స్కాలర్షిప్ అతను/ ఆమె నివసించే ప్రాంతానికి చెందిన రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వం ద్వారా ఇవ్వబడతాయి.
Must read :: JNVST Teaching, Non-Teaching Staff Recruitment 2022 |1616 టీచర్ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన | ఖాళీల వివరాలివే..
ముఖ్య లక్ష్యాలు:
◆ పేద కుటుంబాల నుండి వచ్చిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఉన్నత విద్యలో SC విద్యార్థుల విద్యాభివృద్ధి నమోదు నిష్పత్తి పెంచడానికి.
◆ మెట్రిక్యులేషన్ లేదా సెకండరీ దశలో SC విద్యార్థులకు వారి బారి విద్యాభ్యాసాన్ని పూర్తి చేయడానికి చేయూతగా ఆర్థిక సహాయాన్ని అందించడానికి.
అర్హత ప్రమాణాలు:
◆ విద్యార్థులు భారతీయ పౌరులు ఉండాలి.
◆ అలాగే షెడ్యూల్ కులానికి చెందిన పోస్ట్ మెట్రిక్ స్థాయి విద్యార్హత కలిగి ఉండాలి.
ఆదాయ వివరాలు:
◆ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 2.5 లక్షలకు మించకుండా ఉండాలి.(వీరు మాత్రమే అర్హులు).
స్కాలర్షిప్ అంశాలు:
◆ అర్హులైన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వ ఫీజు నిర్ధారణ క్రింద ట్యూషన్ ఫీజు తో పాటు, అకడమిక్ అలవెన్స్ లను కలిపి స్కాలర్షిప్ అందిస్తారు.
గ్రూప్ 1:
డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి ప్రొఫెషనల్ కోర్సుల కోసం డే స్కాలర్ లకు సంవత్సరానికి రూ.7000/-. అలాగే హాస్టల్లో ఉండే విద్యార్థులకు సంవత్సరానికి రూ.13,500/- స్కాలర్షిప్ గా చెల్లిస్తారు.
C-DAC JOBs 2022 | హైదరాబాద్ లోని C-DAC, బీటెక్ అర్హతతో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
గ్రూప్ 2:
డిగ్రీ డిప్లొమా సర్టిఫికెట్ స్థాయి కోర్సుల కోసం డే స్కాలర్ లకు సంవత్సరానికి రూ.65,00/-. అలాగే హాస్టల్లో ఉండే విద్యార్థులకు సంవత్సరానికి 9,500/- స్కాలర్షిప్ గా చెల్లిస్తారు.
గ్రూప్ 3:
పైన పేర్కొన్న టువంటి - గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ల క్రింద కవర్ కానీ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యూవెట్ స్థాయి కోర్సుల కోసం డే స్కాలర్ లకు సంవత్సరానికి రూ.3000/-. అలాగే హాస్టల్లో ఉండే విద్యార్థులకు సంవత్సరానికి రూ.6000/- స్కాలర్షిప్ గా చెల్లిస్తారు.
JOB Alert 2022 | 10 పాస్ తో 89 గ్రూప్-'సి' ఉద్యోగాల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండిలా..
గ్రూప్ 4:
పోస్ట్ మెట్రిక్యులేషన్ నాన్ డిగ్రీ స్థాయి కోర్సుల కోసం డే స్కాలర్ లకు సంవత్సరానికి రూ.2500/-. అలాగే హాస్టల్లో ఉండే విద్యార్థులకు సంవత్సరానికి రూ.4000/- స్కాలర్షిప్ గా అందిస్తారు.
దివ్యాంగ విద్యార్థులకు 10% అదనపు అలవెన్సులు.
దరఖాస్తు ప్రక్రియ:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
NABARD Grade-A Officers Recruitment 2022 | నాబార్డ్ 170 గ్రేడ్-A ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఏప్రిల్ 14 2022 నుండి తెరిచి ఉంది...
దరఖాస్తులకు చివరి తేదీ: ప్రకటించ బడలేదు.
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్: https://scholarships.gov.in/
ఉచిత విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.. తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment