TS Gurukulam Part-Time Teacher JOBs 2022 | తెలంగాణ గురుకుల కళాశాలలో టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన | ఖాళీల వివరాలు దరఖాస్తు విధానం ఇదే..
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
తెలంగాణ గురుకుల విద్యాలయం సంస్థ, కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు టీచర్ ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష ఆధారంగా ఎన్నికలు నిర్వహించనుంది. ఈ పార్ట్ టైం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ, ఏకలవ్య గురుకుల ప్రతిభ కళాశాల యందు ఇంటర్మీడియట్ తో పాటు IIT-JEE(Mains/Advances)/NEET శిక్షణలు ఇస్తున్న సీనియర్ ఫ్యాకల్టీ కి సహాయంగా సబ్జెక్ట్ అసోసియేట్ గా పని చేయాల్సి ఉంటుంది. ఈ పార్ట్ టైం ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఈరోజు నుండి అనగా (16.07.2022) ప్రారంభమైనది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూలై 23 లోగా ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయిన ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
JOB Alert 2022 | 10 పాస్ తో 89 గ్రూప్-'సి' ఉద్యోగాల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండిలా..
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 149.
విభాగాల వారీగా ఖాళీలు:
◆ మ్యాథ్స్ లో -26,
◆ ఫిజిక్స్ లో - 29,
◆ కెమిస్ట్రీ లో - 32,
◆ బోటనీ లో - 30,
◆ జువాలజీ లో - 32.. మొదలగునవి.
Must read :: JNVST Teaching, Non-Teaching Staff Recruitment 2022 |1616 టీచర్ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన | ఖాళీల వివరాలివే..
విద్యార్హత ::
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, సంబంధిత సబ్జెక్ట్ లో కనీసం 60 శాతం మార్కులతో పీజీ, బీఈడీ కోర్సు పూర్తి చేసి, సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యతనిస్తారు.
వయో-పరిమితి ::
జూలై-23, 2022 నాటికి, 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం ::
★ రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
■ మొత్తం 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
◆ రాత పరీక్షకు 100 మార్కులు,
◆ డెమో కు 25 మార్కులు,
◆ ఇంటర్వ్యూ లకు 25 మార్కులు.
● సంబంధిత సబ్జెక్టు నుండి 50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
● ప్రతి ప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు.
● నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
● ప్రతి తప్పు సమాధానానికి 0.5 మర్క్స్ కోత విధిస్తారు.
● పరీక్ష సమయం 60 నిమిషాలు.
● రాత పరీక్షలో ప్రతిభ కనపరిచిన అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో షార్ట్ లిస్ట్ చేసి డెమో, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
సూచన: మహిళా కళాశాలల్లో బొదించడానికి మహిళలకు మొదటి ప్రాధాన్యత కల్పించారు.
RDO JOBs :: గ్రామీణభివృద్ధి ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, స్వంత రాష్ట్రంలో పోప్స్టింగ్..
గౌరవ వేతనం ::
ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల ₹.25,000/-. జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం ::
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: ₹.500/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 16.07.2022 నుండి,
దరఖాస్తులకు చివరి తేదీ :: 23.07.2022.
అధికారిక వెబ్సైట్ :: https://tgtwgurukulam.telangana.gov.in/ & https://www.tswreis.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులు సమర్థించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఉచిత విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.. తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment