Bank of Baroda IT Professionals Recruitment 2021 || BE/B.Tech may apply online || Vacancies || Eligibility || Selection Procedure || Exam Patran and more here..
నిరుద్యోగులకు శుభవార్త!
బ్యాంక్ ఆఫ్ బరోడా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తూనే ఉంది.. ముంబై/ హైదరాబాద్.. భారతదేశం అంతటా విస్తరించి ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా విభాగాల్లో రెగ్యులర్/ కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి తాజాగా మరి ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ పోస్టుల భర్తీకి బీఈ/ బీటెక్ అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 8 2021 నుండి ప్రారంభమైంది.. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి 28 డిసెంబర్ 2021 చివరి తేదీ గా ప్రకటించింది.
హైదరాబాద్ రీజియన్ లో కూడా ఈ ఖాళీలు ఉన్నట్లు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య : 52,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
బ్యాంక్ ఆఫ్ బరోడా రెగ్యులర్ పోస్టుల వివరాలు:
1. క్వాలిటీ అస్యూరెన్స్ లీడ్ - 02,
2. క్వాలిటీ అస్యూరెన్స్ ఇంజనీర్ - 12,
3. డెవలపర్ (ఫుల్ స్టాక్ జావా) - 12,
4. డెవలపర్ (మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్) - 12,
5. UI /UX డిజైనర్ - 02,
బ్యాంక్ ఆఫ్ బరోడా కాంట్రాక్ట్ పోస్టుల వివరాలు:
6. కోల్డ్ ఇంజనీర్ - 02,
7. అప్లికేషన్ ఆర్కిటెక్ - 02,
8. ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ - 02,
9. టెక్నాలజీ ఆర్కిటెక్ - 02,
10. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్ - 02,
11. ఇంటరాగేషన్ ఎక్స్పర్ట్ - 02,..
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి బీఈ/ బీటెక్ ఇంజనీరింగ్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో ఉత్తీర్ణత సర్టిఫికెట్ సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పోస్ట్ లను బట్టి 1 సంవత్సరం నుండి 6 సంవత్సరాల వరకు అనుభవం కలిగి ఉండాలి. ఆరు నెలలకు పైబడి సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థుల దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
వయసు: పోస్టులను అనుసరించి డిసెంబరు 1 2021 నాటికి 23 నుండి నలభై ఐదు సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు కల్పించారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ను పేటి చివరిలో ఉన్న అధికారిక నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి చదవండి.
జీతం: పోస్టులను అనుసరించే రూ.36,000/- నుండి రూ.78,230/-వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్ ,ఇంటర్వ్యూలు నిర్వహించే తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు.
రాత పరీక్ష విధానం:
ఈ పరీక్ష ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ రూపంలో నిర్వహిస్తారు.
నాలుగు విభాగాల నుండి ప్రశ్నలు అడుగుతారు.
1. రీజనింగ్ నుండి 25 ప్రశ్నలు.
2. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 25 ప్రశ్నలు.
3. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలు.
ఈ మూడు విభాగాల లోని ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
4. ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుండి 75 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు.
ఇలా మొత్తం 150 ప్రశ్నలకు, 225 మార్కులు కేటాయించారు.
పరీక్ష సమయం: 150 నిమిషాలు.
నెగెటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్క్ కోత విధిస్తారు.
పరీక్ష సెంటర్ల వివరాలు: భారతదేశం అంతటా పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
తెలుగు రాష్ట్రాల వారికి హైదరాబాద్ విశాఖపట్టణం లలో ఏర్పాటు చేశారు.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.600/-.
ఎస్సీ ఎస్టీ మరియు దివ్యాంగులకు రూ.100/-.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.12.2021,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 28.12.2021.
అధికారిక వెబ్సైట్ :: https://www.bankofbaroda.in/
అధికారిక నోటిఫికేషన్:: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్ :: ఇదే.. 👈
ఇవి కూడా చదవండి..
పూర్తి వివరాలకు ఇమేజ్ పై క్లిక్ చేయండి..
Comments
Post a Comment