TS Holidays Extension G.O copy || Online Classes Recording Schedule at SIET Hyderabad Download here..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వల్ల ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవులు పొడిగించినట్లు ప్రకటన.
కరోనా మహమ్మారి కేసులు అత్యధికంగా ప్రబలుతున్న కారణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవు ను పొడిగించినట్లు సమాచారం వివిధ సోషల్ మీడియా గ్రూపులలో తిరుగుతూనే ఉన్నది. అయితే దీని పై క్లారిటీ ను 16 వ తేదీన ప్రకటించింది. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలకు సంక్రాంతి సెలవులను 8-16 వరకు ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇదే సెలవులను ఈనెల 30 వరకు పొడిగిస్తున్నట్లు అధికారికంగా ఉత్తర్వులను విడుదల చేసింది.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున వైద్య ఆరోగ్య శాఖ సమాచారం మేరకు సెలవులను పొడిగించిన ట్లు తెలిపారు, పాఠశాలలు కళాశాలలు రీ ఓపెన్ చేయడం వల్ల, కేసుల సంఖ్య మరింత పెరుగుతుందని హాస్టల్లో సంబంధిత స్పెషలిటీ లేనందున ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసర్లు అంటున్నారు.
ముఖ్య సమాచారం:
💧పాఠశాలలు, కళాశాలలో ఈనెల 30 వరకు బంద్.
💧మెడికల్ కళాశాలలకు మినహాయింపు.
💧ఓయూ, జె ఎన్ టి యు పరిధి లలో మాత్రం ఆన్లైన్ క్లాసులు.
💧ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ పాఠశాలలకు ఆన్లైన్ క్లాసులు పై స్పష్టత త్వరలో...
స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ రామంతపూర్, హైదరాబాద్..
తాజాగా రికార్డింగ్ షెడ్యూల్ ను విడుదల చేసింది.
డౌన్లోడ్ చేయడానికి: ఇక్కడ క్లిక్ చేయండి.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment