Free Training for JOBs - 2022 | టిఎస్ స్టడీ సర్కిల్ ఉచిత ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం | వివరాలివే..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ జాతరలో భాగంగా పలు నోటిఫికేషన్లను విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే, మరియు దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న IBPS బ్యాంకుల్లో ఖాళీగా భర్తీకి 8106 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది.. దీనికి తోడుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ స్టడీ సర్కిల్ ద్వారా నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 1000 మందికి ఉచిత శిక్షణను అందించడానికి తాజాగా నోటిఫికేషన్ను విడుదల చేసింది, దరఖాస్తు చేసుకున్న ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించి స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా నిర్వహిస్తున్న టువంటి ఈ ప్రవేశాలకు ఎంపికై ఉద్యోగాలను చేపట్టాలని నిరుద్యోగ యువతకు సూచనలు చేసింది.. ఈ ఉచిత IBPS ఉద్యోగ శిక్షణ లకు సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా మొత్తం సీట్ల సంఖ్య విద్యార్హత విభాగాల వారీగా సీట్ల వివరాలు దరఖాస్తు విధానం ఎంపిక విధానం ముఖ్య తేదీలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం..
V-TG CET - 2022 Phase-II Results | తెలంగాణ 5వ తరగతి గురుకుల phase-II ఫలితాలు విడుదల..
IBPS (Banning) - ఉద్యోగ ఉచిత శిక్షణ అర్హత ప్రమాణాలు:
◆ ఏపీ ఎస్సీ మరియు బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
◆ అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి పైబడి ఉండాలి.
◆ దరఖాస్తుదారు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ₹.1,50000/-. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ₹.2,00,000/- మించకుండా ఉండాలి.
◆ ఇప్పటికే ఉచిత శిక్షణ ను తీసుకొని ఉన్న వారు మరలా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు.
◆ అభ్యర్థులు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే ఉండాలి.
JOB Alert 2022 | TSPSC నుండి మరొక ఉద్యోగ ప్రకటన | గ్రాడ్యుయేట్లు అర్హులు | ఖాళీల వివరాలివే..
వర్గాల వారీగా సీట్ల కేటాయింపు వివరాలు:
◆ షెడ్యూల్ ట్రైబ్ లకు - 75%
◆ షెడ్యూల్ క్యాస్ట్ లకు - 15%
◆ బ్యాక్వర్డ్ క్లాసెస్ లకు - 10%
◆ వీటిలో... మహిళలకు - 33%, దివ్యాంగులకు3%
ఎంపిక విధానం:
◆ స్క్రీనింగ్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
◆ నోటిఫికేషన్లో పేర్కొన్న వివరాల ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారు.
ముఖ్య తేదీలు:
◆ నోటిఫికేషన్ విడుదల : 14.07.2022
◆ దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ : 31.07.2022
◆ ఎంపిక జాబితా ప్రకటన : 11.08.2022
◆ ధ్రువపత్రాల పరిశీలన తేదీ : 16.08.2022
◆ శిక్షణలు ప్రారంభమవు తేదీ : 17.08.2022
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు లో భాగంగా ఈ క్రింది అర్హత పత్రాల కాపీలను సమర్పించాలి.
◆ కుల ధ్రువీకరణ పత్రం
◆ నేటివిటీ సర్టిఫికెట్
◆ ఆదాయ ధ్రువీకరణ పత్రం
◆ పదవ తరగతి నుండి డిగ్రీ వరకు అర్హత ధ్రువపత్రాల మెమోలు
◆ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్
◆ పాస్ ఫోటో ఆధార్ కార్డులను మొదలగునవి.
ఆర్థిక సహకారం:
◆ ఎంపికైన అభ్యర్థులకు భోజన వసతి సౌకర్యాల నిమిత్తం ఒక్కొక్కరికి నెలకు ₹.4000/-, ట్రావెలింగ్ అలవెన్స్ కింద నెలకు ₹.1000/-, అలాగే బుక్ గ్రాంట్ క్రింద ₹.1500/-, మరియు ఆన్లైన్ టెస్ట్ ప్రాక్టీస్ నిమిత్తము ₹.350/- చెల్లిస్తారు.
నిరుద్యోగ అభ్యర్థులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అలాగే సంబంధిత మరియు సందేహాల నివృత్తి కోసం 8309494387 నెంబర్కు సంప్రదించాలని కోరారు.
అధికారిక వెబ్సైట్ :: https://studycircle.cgg.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment