WDCW AWT AWH Recruitment 2021 || Apply 102, Teacher, Mini Teacher, Aaya posts..
తెలంగాణ అంగన్వాడీ లో ఉద్యోగాల సందడి.
తెలంగాణ ప్రభుత్వం, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి అంగన్వాడి టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, హెల్పర్ (ఆయా ) పోస్టుల భర్తీకి.. పదవ తరగతి పాసై, వివాహితులైన మహిళల నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 11 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 102 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దరఖాస్తు విధానం, వయోపరిమితి, విద్యార్హత.. మొదలగు వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 102.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. అంగన్వాడి టీచర్ పోస్టులు -13,
2. మినీ అంగన్వాడి టీచర్ పోస్టులు - 37,
3. అంగన్వాడీ హెల్పర్(ఆయా) పోస్టులు - 52..
పైన తెలిపిన ఈ పోస్టులకు జిల్లాలోని దిగువ తెలిపిన ప్రాజెక్ట్ ల లో ఖాళీలు గా సూచించారు.
ప్రాజెక్టు పేర్లు:
1. అప్పారావుపేట
2. బూర్గంపాడు
3. చండ్రుగొండ
4. చర్ల
5. దమ్మపేట
6. దుమ్ముగూడెం
7. కొత్తగూడెం
8. మణుగూరు
9. పాల్వంచ
10. టేకులపల్లి
11. ఇల్లందు.. ప్రాజెక్ట్ లలో ఈ ఖాళీలు ఉన్నాయి.
వివరణాత్మక సమాచారం కోసం, దిగువ తెలిపిన నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి, అధికారిక నోటిఫికేషన్, ప్రాజెక్టుల వారీగా విభజించిన పోస్టుల వివరాలను తెలుసుకోండి.
అర్హతలు:
అభ్యర్థులు తప్పనిసరిగా పదవ తరగతి పాసై, వివాహితులు రాలై ఉండాలి.
వయసు:
జూలై 1, 2021 నాటికి ఇరవై ఒక్క సంవత్సరాలు నుండి 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
★ ట్రైబల్ ఏరియా లోనీ అభ్యర్థిని లు ఆయా గ్రామాల్లో మాత్రమే నివసిస్తూ ఉండాలి.
★ రూరల్ ప్రాంతాలలోని అభ్యర్థిని లు స్థానిక గ్రామ పంచాయతీ వారై ఉండాలి.
★ పట్టణ ప్రాంతం అయితే సంబంధిత వార్డుల్లో నివసిస్తూ ఉండాలి.
■ దివ్యాంగులు అయితే:
★ వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు,
★ ఆంధ్రత్వం ఉన్నప్పటికీ ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించే గలిగేవారు,
★ కళ్ళు, చేతులకు సంబంధించే అంగవైకల్యం ఉన్నా.. ప్రాథమిక విద్య నేర్పుటకు కానీ, పిల్లల సంరక్షణకు కానీ, ఎలాంటి ఆటంకం లేని వారు ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
★ ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి కేటాయించిన అంగన్వాడీ కేంద్రాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థిని లో ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన వారు లేకపోతే.. 18 సంవత్సరాలు నిండిన వారిని అర్హులుగా పరిగణిస్తారు.. #ఈకేంద్రాలలో18సంవత్సరాలునిండినవారుకూడాఅర్హులు..
దరఖాస్తు విధానం:
★ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
★ అంగన్వాడి టీచర్లు, మినీ టీచర్లు, ఆయా పోస్టులకు మహిళలు దరఖాస్తుతోపాటు నోటిఫికేషన్లో పేర్కొన్న ధ్రువీకరణ పత్రాల పై గెజిటెడ్ అధికారులతో ధృవీకరించు కొని ఈనెల 31 సాయంత్రం 5 గంటల వరకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తు చేసుకోండి.
★ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న వారు సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఆగస్టు2, 2021 నుండి ఆగస్టు 6, 2021 వరకు ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కృట్నీ చేయించుకోవాలి.
★ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని స్కృట్నీ ని చేయించుకోకపోతే ఆ దరఖాస్తులను పరిగణలోకి తీసుకోరు.
ఆన్లైన్ దరఖాస్తు చేస్తున్నప్పుడు జత పరచవలసిన ధ్రువపత్రాలు..
1. పుట్టిన తేదీ/ వయసు ధ్రువీకరణ పత్రము,
2. కుల దృవీకరణ పత్రము,
3. విద్యార్హత ధ్రువీకరణ పత్రము, పదవ తరగతి మార్కుల జాబితా,
4. నివాస ధ్రువీకరణ పత్రము,
5. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి ధ్రువీకరణ పత్రము,
6. అనాధ అయితే, అనాధ సర్టిఫికెట్,
7. వికలాంగులు అయితే, సంబంధిత మెడికల్ సర్టిఫికెట్, స్కానర్ కాపీలను అప్లోడ్ చేయాలి.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం కోసం.. ఈ వీడియో చూడండి.
అధికారిక వెబ్సైట్: https://wdcw.tg.nic.in/ https://mis.tgwdcw.in/
అధికారిక నోటిఫికేషన్:
నమూనా దరఖాస్తు ఫామ్:
ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్: https://mis.tgwdcw.in/
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment