JCI Recruitment 2021 || Inter Degree passed nay Apply Online || Check Application and selection process here..
ప్రభుత్వానికి చెందిన జూట్ కార్పొరేషన్, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ విభాగం లో ఉన్నటువంటి వివిధ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్, ఎం కామ్, విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు జనవరి 13, 2022 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
భారతదేశంలోని జ్యూట్ ప్రధాన ఉత్పత్తిదారులు గా ఉన్న ఆరు రాష్ట్రాలను అవి; ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సా, అస్సాం, త్రిపుర, బీహార్, పశ్చిమ బెంగాల్ మొదలైనవి. జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆశాజనకంగా, శక్తివంతంగా మరియు ఆసక్తి కలిగిన యువత కోసం ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది.
నోటిఫికేషన్ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో ఉన్నటువంటి ఖాళీల భర్తీకి ఆస్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 63,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. అకౌంటెంట్ - 12,
2. జూనియర్ అసిస్టెంట్ - 11,
3. జూనియర్ ఇన్ స్పెక్టర్ - 40,
అకౌంటెంట్ ఉద్యోగాలకు విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి అడ్వాన్స్డ్ అకౌంటెన్సీ మరియు ఆడిటింగ్ స్పెషల్ సబ్జెక్టుగా ఎంకాంమ్ ఉత్తీర్ణత కలిగి, సంబంధిత విభాగంలో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి./ బీకాం విద్యార్హతతో మెయిన్ టింగ్ ఆఫ్ కమర్షియల్ అకౌంట్ నందు 7 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నవారు కూడా దరఖాస్తులు చేయవచ్చు.
జీతం: పే స్కేల్ రూ.28,600/- నుండి రూ.1,15,000/-
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో (ఎమ్మెస్ ఆఫీస్ ఎక్సెల్) అనుభవంతో నిమిషానికే ఇంగ్లీష్ లో 40 పదాలను టైప్ చేయగల సామర్థ్యం కలిగి ఉన్నవారు అర్హులు.
జీతం: పే స్కేల్ రూ.21,500/- నుండి రూ.86,000/-
జూనియర్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన ఉత్తీర్ణతతో.. సంబంధిత విభాగంలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉన్నవారు అర్హులు.
జీతం: పే స్కేల్ రూ.21,500/- నుండి రూ.86,000/-
వయసు: డిసెంబర్ 1, 2021 నాటికి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. మరియు రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లోని పై ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోనే విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అభ్యర్థులు, అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
అధికారిక వెబ్ సైట్ లింక్:https://www.jutecorp.in/
దరఖాస్తు చేసుకోవడానికి ముందు అభ్యర్థులు ఈ క్రింది వాటిని కలిగి ఉండాలి.
పని చేస్తున్నటువంటి ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, వ్యక్తిగత మరియు విద్యార్హత ధ్రువ పత్రాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో గ్రాఫ్, సిగ్నేచర్.. మొదలగు వివరాలు, నమోదు/ అప్లోడ్ చేయడానికి సిద్ధం చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :: రూ.200/-.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ ఛాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ ,రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.12.2021,
దరఖాస్తులకు చివరి తేదీ: 13.01.2022.
అధికారిక వెబ్సైట్: https://www.jutecorp.in/
అధికారిక నోటిఫికేషన్:: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
Comments
Post a Comment