NAC TWD TRICOR | Application for Finishing school and Supervisor Structure Training Programmes in NAC, Hyderabad
గిరిజన యువతకు ఉపాధి ఆధారిత నైపుణ్య శిక్షణ
తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ విభాగానికి చెందిన తెలంగాణ షెడ్యూల్ ట్రైబ్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ట్రైకార్)... నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్, ఐఐటి(సివిల్), డిప్లమా(సివిల్), మరియు బీటెక్(సివిల్), పూర్తి చేసినటువంటి అభ్యర్థుల నుండి మూడు నెలల ప్లేస్మెంట్ లింక్డ్ ట్రైనింగ్ అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది.
ఈ శిక్షణలో మాదాపూర్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) లో మూడు నెలలపాటు ఉచిత భోజనం మరియు వసతి సౌకర్యం తో అందిస్తారు.
కోర్సుల వివరాలు:
పోస్టుల సంఖ్య: 02,
I. ఫినిషింగ్ స్కూల్ ట్రైనింగ్ ప్రోగ్రాం:
అర్హత ప్రమాణాలు:
1. బీటెక్(సివిల్)/ బిఈ(సివిల్ ఇంజనీరింగ్) అర్హత కలిగి ఉండాలి.
2. వయసు: 21 నుండి 35 సంవత్సరాలు
3. ఆదాయం: గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న వారికి 1,50,000/-; పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న వారికి 2,00,000/- మించ కూడదు.
5. అభ్యర్థులు తెలంగాణ లోకల్ ప్రాంతం వారే ఉండాలి. మరియు వివాహితులకు ప్రాధాన్యత ఉంటుంది.
II. సూపర్వైజర్ స్పెక్టర్:
అర్హత ప్రమాణాలు:
1. ఇంటర్మీడియట్/ ఐటిఐ(సివిల్)/ డిప్లమా(సివిల్) అర్హత కలిగి ఉండాలి.
2. వయసు: 21 నుండి 35 సంవత్సరాలు
3. ఆదాయం: గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న వారికి 1,50,000/-; పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న వారికి 2,00,000/- మించ కూడదు.
5. అభ్యర్థులు తెలంగాణ లోకల్ ప్రాంతం వారే ఉండాలి. మరియు వివాహితులకు ప్రాధాన్యత ఉంటుంది.
ఎంపిక విధానం: ఈ రెండు ట్రైనింగ్ లకు రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు, అలాగే అకడమిక్ విద్యార్హతలకు సాధించిన మార్కులు, అనుభవం ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
రాత పరీక్ష విధానం:
★ ఈ పరీక్ష మల్టిపుల్ ఛాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ రూపంలో ఉంటుంది.
★ మొత్తం 60 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.
జనరల్ నాలెడ్జ్ నుండి పది ప్రశ్నలు.
★ సివిల్ ఇంజనీరింగ్ సబ్జక్ట్స్ నుండి 50 ప్రశ్నలు అడుగుతారు.
★ పరీక్ష సమయం 60 నిమిషాలు.
ప్రవేశం పొందే సమయంలో సమర్పించవలసిన ధృవపత్రాలు జాబితా:
1. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లమా, ఐటిఐ(సివిల్), మరియు బీటెక్ (సివిల్) పాస్ మెమో లు,
2. కుల ధ్రువీకరణ పత్రం,
3. ఆదాయ ధ్రువీకరణ పత్రం,
4. పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాఫీలు,
5. ఆన్లైన్లో సబ్మిట్ చేసినటువంటి దరఖాస్తు ఫామ్...
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు లకు చివరి తేదీ: 20.10.2021.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు వీడియొలో👇
అధికారిక వెబ్సైట్: https://tstribalwelfare.cgg.gov.in/ & https://nac.edu.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: https://nac.edu.in/
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here (ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, మెరిట్కం మీన్స్ స్కాలర్షిప్ లకు దరఖాస్తులు ఆహ్వానం)
📢 for Admission Notification Click here (సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ ప్రవేశాలు 2021)
📢 for Employment News Click here
Comments
Post a Comment