HPCL 294 Vacancy Recruitment 2022 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన HPCL | భారీగా ఉద్యోగాలభర్తీ..
ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు శుభవార్త!
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ దేశ వ్యాప్తంగా విస్తరించి యున్న పెట్రోలియం యూనిట్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలాంటి అనుభవం లేకున్నా, సంబంధిత విభాగంలో తప్పనిసరిగా నాలుగు సంవత్సరాల ఇంజినీరింగ్ డిగ్రీ పట్టా కలిగి ఉండాలి. దరఖాస్తులు ఈనెల 23 నుండి ప్రారంభమైనవి, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరిచేలా అభ్యర్థులు 22.07.22 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు ఉంటాయి.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు, సిలబస్.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 294,
విభాగాల వారీగా ఖాళీలు:
◆ మెకానికల్ ఇంజనీర్స్ లో- 103,
◆ ఎలక్ట్రికల్ ఇంజనీర్ లో - 42,
◆ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లో - 30,
◆ సివిల్ ఇంజనీర్ లో - 25,
◆ కెమికల్ ఇంజనీర్ లో - 7,
◆ ఇన్ఫర్మేషన్ సిస్టం ఆఫీసర్ లో -5,
◆ సేఫ్టీ ఆఫీసర్ ఉత్తర ప్రదేశ్ - 6,
◆ సేఫ్టీ ఆఫ్ తమిళనాడు - 1,
◆ సేఫ్టీ ఆఫీసర్ కేరళ - 5,
◆ సేఫ్టీ ఆఫీసర్ గోవా - 1,
◆ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ - 27,
● ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ - 2,
◆ బ్లిండింగ్ ఆఫీసర్ - 5,
◆ చార్టెడ్ అకౌంట్ - 15,
◆ హెచ్ఆర్ ఆఫీసర్ - 8,
◆ హెల్త్ ఆఫీసర్ - వైశాఖ రిఫైనరీ & వెల్ఫేర్ ఆఫీసర్ - ముంబై రిఫైనరీ - 2,
◆ లా ఆఫీసర్ - 5,
◆ లా ఆఫీసర్ హెచ్ ఆర్ -2,
◆ మేనేజర్ /సీనియర్ మేనేజర్ - ఎలక్ట్రికల్ -3.. మొదలగునవి.
అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి, పోస్టులను అనుసరించి కొన్నింటికి అనుభవం అవసరం.
వయో-పరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి 25 సంవత్సరాల నుండి ముప్పై ఏడు సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాలవారికి సడలింపు వర్తిస్తాయి..
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి రాత పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
రాత పరీక్షలో ◆ జనరల్ ఆప్టిట్యూడ్
◆టెక్నికల్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుండి ప్రశ్నలు అడుగుతారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు ₹.1180/-
రిజర్వేషన్ వర్గాల వారికి ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.06.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 22.07.2022.
అధికారిక వెబ్సైట్: https://www.hindustanpetroleum.com/ & https://www.hindustanpetroleum.com/job-openings
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment