IBPS JOBs 2022 | IBPS ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 8106 పోస్టుల భర్తీకి భారీ ప్రకటన | పూర్తి వివరాలివే..
నిరుద్యోగులకు శుభవార్త!
● 8,106 బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్..
● ఆఫీసర్లు, ఆఫీస్ అసిస్టెంట్, మల్టీ పర్పస్... విభాగాల్లో ఖాళీలు.
TS TET 2022 Official KEY Released | Download & Check your Score here..
IBPS నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది..
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న నోడల్ రీజనల్ రూరల్ బ్యాంక్, (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో) 8,106 ఖాళీల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో, ప్రాంతీయ భాషా పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు.. జూన్ 27న దరఖాస్తులకు చివరి గడువుగా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయిన ఖాళీల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, గౌరవ వేతనం, ముఖ్యమైన తేదీలు.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం..
సూచన :: తాజా ఉద్యోగ సమాచారాన్ని అందరికంటే ముందు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి.. మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 8,106.
విభాగాల వారీగా ఖాళీల వివరాలను తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ను కింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి చదవండి.. దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న అన్ని రాష్ట్రాల లో ఉద్యోగ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తగు వివరాలను నోటిఫికేషన్ ఆధారంగా తెలుసుకొని తప్పక ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించండి..
అర్హత ప్రమాణాలు:
భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు..
విద్యార్హత:
● ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో, ప్రాంతీయ భాషా పరిజ్ఞానం కలిగి, కంప్యూటర్ స్కిల్ కలిగి ఉండాలి.
● అనుభవం అవసరం లేదు.
వయో-పరిమితి:
జూన్ 1, 2022 నాటికి పోస్టులను అనుసరించే 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల కు మించకుండా వయస్సు ఉండాలి.
తెలంగాణ లోని శ్రీ చైతన్య పాఠశాల ఇంటర్వ్యూ ల ద్వారా బోధనా సిబ్బంది ఖాళీల భర్తికి పర్సకటన..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
● జనరల్ అభ్యర్థులకు ₹.850/-.
● రిజర్వేషన్ వర్గాలవారికి ₹.175/-.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, టెస్ట్, ప్రాంతీయబాష పరీక్ష, మెడికల్ టెస్ట్.. ఆధారంగా నిర్వహిస్తారు..
పరీక్ష సెంటర్ల వివరాలు:
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
★ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో సెంటర్ లను ఎంపిక చేయవచ్చు..
★ రాత పరీక్ష ప్రాంతీయ భాషలో రాసుకునే అవకాశాన్ని కల్పించారు.
★ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఇంగ్లీష్, హిందీ, తెలుగు మరియు ఉర్దూ.. భాషలలో పరీక్షలు రాయవచ్చు.
అధికారిక వెబ్సైట్: https://www.ibps.in/
అధికారిక నోటిఫికేషన్1: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్2: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.06 2022 నుండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 23.07.2022.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment