Mega JOB Mela 2022 | రేపే 15వేల ఉద్యోగాల భర్తీకి మెగా జాబ్ మేళా | రిజిస్టర్ అవ్వండిలా..
నిరుద్యోగులకు శుభవార్త!
ఆంధ్రప్రదేశ్‌లో రేపు వైసిపి ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు.. ట్విట్టర్ వేదికగా ఈ జాబ్ మేళా కు సంబంధించిన పోస్టర్లు, వెబ్ సైట్ ను డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి తదితరులు కలిసి ప్రారంభించడం జరిగింది. ఏపీ ప్రభుత్వం జాబ్ మేళా ద్వారా వేల సంఖ్యలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు సమాచారం.
Mega Job Mela 2022 | తెలంగాణలోని అ జిల్లాలో 1500+ జాబ్స్.. రిజిస్టర్ అవ్వండిలా..
YSRCP ఆధ్వర్యంలో ఇటీవల భారీగా జాబ్ మేళా (YSRCP Job Mela) లు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. ఈ నెల 25న కడప జిల్లాలో భారీ జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి.. వివిధ మల్టీనేషనల్ కంపెనీల తో నిరుద్యోగ యువతకు డైరెక్ట్ ఇంటర్వ్యూలను ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది.
వైఎస్సార్ కడప జిల్లా చాపాడు మండలంలోని సీబీఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఈనెల 25న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించబోతున్నాం. ఈ జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లు, వెబ్‌సైట్‌ను డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, ఎంపీ అవినాష్‌రెడ్డి తదితరులతో కలిసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. pic.twitter.com/PB1t5NiDWR
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 11, 2022
కడప జిల్లా చాపాడు మండలం లోని సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజీలో ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్ల వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు.
పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి సంబంధిత సమాచారాన్ని తెలుసుకోగలరు.
అధికారిక వెబ్ సైట్ లింక్: https://ysrcpjobmela.com/
ఈ జాబ్ మేళా లో పాల్గొంటున్న కంపెనీల వివరాలు:
ఎల్.టి.సి, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, పేటీఎం, బైక్ జ్యూస్, బిగ్ బాస్కెట్, నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్, యాక్సిస్ బ్యాంక్, ముత్తూట్ ఫైనాన్స్, అవని టెక్నాలజీ సొల్యూషన్స్, అపోలో, హుండాయ్ మొబైల్స్, ఎయిర్టెల్ పేటియం బ్యాంక్ మొదలైన కంపెనీలు పాల్గొని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఉన్నాయి. అయితే ఈ జాబ్ మేళా కు సంబంధించి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
YSRCP JOB MELA కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్: https://ysrcpjobmela.com/
◆ తదుపరి YSR District JOB Mela క్రింద కనిపిస్తున్న Apply Now లింక్ పై క్లిక్ చేయండి.
◆ రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది, మీ సంబంధిత వివరాలను నమోదు చేస్తూ.. రిజిస్టర్ అవ్వండి.
◆ సంబంధిత రిజిస్ట్రేషన్ ఫామ్ తో కడప జిల్లా చాపాడు మండలం లోని CBIT ఇంజనీరింగ్ కాలేజీలో రేపు (జూన్ 25 న) జరిగే మెగా జాబ్ మేళా కు హాజరై ఉద్యోగాలను కైవసం చేసుకోండి..
YSRCP Job Mela కు హాజరయ్యే అభ్యర్థులు ఈ క్రింది ధ్రువపత్రాలను, ఇంటర్వ్యూ సమయంలో చూపించడానికి తమతో తీసుకెళ్లాల్సి ఉంటుంది.
● వ్యక్తిగత రిజిస్ట్రేషన్ ఫామ్,
● అప్డేటెడ్ బయోడేటా ఫామ్,
● అర్హత ధ్రువపత్రాలు..
● కుల ధ్రువీకరణ పత్రం,
● ఆదాయ ధ్రువీకరణ పత్రం,
● ఆధార్ కార్డ్,
● బ్యాంకు బుక్ జిరాక్స్,
● పాస్ పోర్ట్ సైజు ఫోటోలు.. మొదలగునవి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment