TS TWD JOBs 2022 | తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ, 1514 టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | అర్హత ప్రమాణాలివే..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉద్యోగ జాతరలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖకు 1514 టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి, నియామక ప్రక్రియలో కొనసాగించాలని అధికారికంగా ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లోకా లీల భర్తీకి గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆధ్వర్యంలో నియామకాలు నిర్వహించనుంది. దీనికి సంబంధించిన తాజా మార్గదర్శకాలను జూలై 17న విడుదల చేసింది జూలై 17న విడుదల చేసింది. గిరిజన సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించి ఉద్యోగాలను భర్తీ చేయాలని సూచనలను జారీ చేసింది. సూచనలో భాగంగా విభాగాల వారీగా ఖాళీల వివరాలను కూడా ప్రకటించింది.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ ఆర్ట్ మరియు క్రాఫ్ట్ టీచర్ - 30,
◆ మ్యూజిక్ టీచర్ - 20,
◆ అసిస్టెంట్ లైబ్రేరియన్ - 22,
◆ కేర్ టేకర్ - 15,
◆ కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ - 31,
◆ డిగ్రీ లెక్చరర్ - 452,
◆ హెర్బెరియం/ మ్యూజియం కీపర్ - 15
◆ జూనియర్ లెక్చరర్ - 232,
◆ ల్యాబ్ అసిస్టెంట్ (డిగ్రీ) - 62,
◆ లైబ్రేరియన్ (జూనియర్ కాలేజ్) - 48,
◆ లైబ్రేరియన్ (డిగ్రీ) - 15,
◆ మెస్ మేనేజర్ - 16,
◆ ఫిజికల్ డైరెక్టర్ (స్కూల్) - 38,
◆ ఫిజికల్ డైరెక్టర్ (డిగ్రీ కాలేజ్) - 15,
◆ ఫిజికల్ డైరెక్టర్ (జూనియర్ కాలేజ్) - 11,
◆ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ - 03,
◆ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ - 147,
◆ ప్రిన్సిపల్ (స్కూల్) - 21,
◆ ప్రిన్సిపల్ (డిగ్రీ) - 11,
◆ ప్రిన్సిపల్ (జూనియర్ కాలేజ్) - 03,
◆ స్టాఫ్ నర్స్ - 74,
◆ స్టోర్ కీపర్ - 15,
◆ ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్ - 218.. మొదలగునవి.
తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖలో ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చిన తరుణంలో నోటిఫికేషన్ వస్తే.. ఆ ఉద్యోగాలకు పోటీ పడడానికి అభ్యర్థులకు ఈ క్రింది అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.
◆ టిజిటి పోస్టులకు: బి.ఎడ్ తో పాటు టెట్ పేపర్-2, ఉత్తీర్ణత. 20% వెయిటేజీ గురుకుల నియామకాల్లో కల్పిస్తారు.
◆ పిజిటి పోస్టులకు: బి.ఎడ్ అర్హతతో సంబంధిత సబ్జెక్టులో పీజీ తప్పనిసరిగా ఉండాలి.. దీనికి టికెట్ అవసరం లేదు.
◆ జూనియర్ లెక్చరర్ మరియు డిగ్రీ లెక్చరర్ పోస్టులకు: సంబంధిత సబ్జెక్టులో బి.ఎడ్, ఎం.ఎడ్ అర్హతలు కలిగి ఉండాలి. మరియు సబ్జెక్టులను బట్టి (సెట్ / నెట్) అవసరం. ఈ ఉద్యోగాలకు అవసరం లేదు. పైన పేర్కొన్నటువంటి ఉద్యోగాలకు అన్ని పరీక్షలు ఇంగ్లీష్ లోనే ఉంటాయి. బి.ఎడ్ తెలుగు మీడియం చదివిన వారికి కూడా అవకాశం ఉంటుంది, కానీ ఉద్యోగ పరీక్ష వ్రాయవలసి ఉంటుంది.
★ హాస్టల్ వార్డెన్ పోస్టులకు:
◆ ST వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ గ్రేడ్-2 పోస్టులకు: బి. ఎడ్ తో పాటు.. డిగ్రీ మరియు డీ.ఎడ్ పూర్తి చేసిన వారికి కూడా అవకాశం ఉంటుంది. టెట్ అవసరం లేదు. ఈ ఉద్యోగానికి తెలుగులోనే పరీక్ష ఉంటుంది పేపర్-1, పేపర్-2 రూపంలో నిర్వహిస్తారు.
◆BC వెల్ఫేర్ విభాగంలో గ్రేడ్-1 గ్రేడ్-2 పోస్టులకు: బి.ఎడ్ ఉత్తీర్ణత అవసరం. టెట్ అవసరం లేదు
◆ లైబ్రేరియన్ పోస్టులకు: సంబంధిత విభాగంలో తప్పనిసరిగా కోర్సు పూర్తి చేసి ఉండాలి.
◆ ఆర్ట్ మరియు క్రాఫ్ట్ పోస్టులకు: సంబంధిత విభాగంలో సర్టిఫికెట్ కోర్స్ అర్హత.
◆ స్టాఫ్ నర్స్ పోస్టులకు: జి.ఎన్.ఎమ్ లేదా బీఎస్సీ నర్సింగ్ అర్హత సర్టిఫికెట్, అవసరం.
TS JOB Updates 2022 | 10,105 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | శాఖల వారీగా ఖాళీలివే..
మరిన్ని వివరాలతో కూడిన పూర్తి సమాచారం అధికారిక నోటిఫికేషన్ వెలువడినప్పుడు, ఇంకా క్లుప్తంగా మన వెబ్సైట్ లో ప్రచురించడం జరుగుతుంది..
తాజా ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి ఈ వెబ్ సైట్ లో ప్రచురించిన సమాచారం నచ్చితే సబ్స్క్రయిబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆక్టివేట్ చేసుకోండి.
అదికారిక మార్గదర్శకాలు :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment