TS Teacher Recruitment 2021 for Special Disability Schools | Check Eligibility Details and Apply off line here..
తెలంగాణ ప్రభుత్వం
గిరిజన సంక్షేమ శాఖ భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పొరుగు సేవల నియామకాలకు ధరఖాస్తుల ఆహ్వానం
తేది : 05.11.2021
భద్రాచలం పట్టణం నందు నూతనంగా ప్రారంభించు ప్రత్యేక దివ్యాంగుల పాఠశాల నందు భోధన సిబ్బంది పొరుగు సేవల నియామకం భర్తీ చేయుటకు అర్హత కలిగిన గిరిజన నిరుద్యోగ యువతి యువకులైన ఉమ్మడి ఖమ్మం జిల్లా) కు చెంది వారి నుండి క్రింది తెలిపిన విధముగా దరఖాస్తులు ఆహ్వానించనైనది.
నియామకాల వివరములు:
1. స్పీచ్ ట్రైనర్ - 01,
విధార్హత: Inter, BASLP or MASLP గుర్తింపు పొందిన యూనివర్సిటి నుండి పొంది యుండవలెను.
2. స్పెషల్ ఎడ్యుకేటర్ - 01,
విధార్హత: డిగ్రీ కోర్సు తో పాటుగా B.Ed., (VI) (విజ్యువల్లీ ఇంపాడ్) కోర్సు పూర్తి చేసి అర్హత కలిగి యుండాలి.
ఈ పై పోస్టులకు గాను దరఖాస్తు చేయు అభ్యర్థులు వారి బయోడేటా ఫార్మ్ నందు వివరాలు పేర్కొని మరియు క్రింద తెలిపిన అర్హత పత్రాలు (జారాక్స్) తో జతపరచి ది.15.11.2021 లోపు గిరిజన వికాసం ప్రత్యేక పాఠశాల(ఐటిడిఏ) కూనవరంరోడ్, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఎదురుగా, భద్రాచలం నందు సమర్పించవలెను.
1) హ్యాబిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి గుర్తింపు పొందిన (వ్యాలిడిటి) సర్టిఫికేట్.
2) ప్రత్యేక పాఠశాలలో 3 సం,,ల అనుభవాన్ని కలిగి వుండాలి.
3) 21 సం,, పై బడి వయస్సు కలిగి వుండాలి.
4) వికలాంగుల పిల్లల తల్లిదండ్రులకు మొదల ప్రాధాన్యత ఇవ్వబడును.
విద్యార్థులు అపై చేయుటకు అర్హతలు :
ఇట్టి ప్రత్యేక పాఠశాల నందు 1వ తరగతి నుండి 7వ తరగతి ప్రవేశం కొరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన గిరిజన (మూగ, చెవిటి, అంద) విద్యార్థుల నుండి క్రింద తెలిపిన విధముగా దరఖాస్తులు కోరనైనది.
1) సధరం సర్టిఫికేట్
2) 6-14 సం,, వయస్సు (1వ 7వ తరగతి)
3) కులం (ఎస్టి)
4) వేరే స్కూల్ లో చదివి వుంటే టిసి మరియు బోనఫైడ్ సర్టిఫికేట్
5) కుల ధృవీకరణం
6) ఆధార్‌కార్డు & 2 ఫోటోలు
కావున, ప్రవేశం కొరకు దరఖాస్తు పత్రాలు పాఠశాల ప్రధానోపాధ్యయురాలు వద్ద నుండి పొంది, దరఖాస్తు తో పాటుగా పైన తెలిపిన అన్ని ధృవపత్రములు జతపరచి ది.15.11.2021 లోపు ప్రధానోపాధ్యాయురాలు, గిరిజన వికాశం ప్రత్యేక పాఠశాల నందు సమర్పించవలెను. ఇతర వివరాల కొరకు శ్రీమతి. జి.అరుణ కుమారి, ప్రధానోపాధ్యా యురాలు, సెల్ నెం.9381181407 వారిని సంప్రదించవలెను...
ఈ ప్రాజెక్టు అధికారి,
ఐటిడిఏ, భద్రాచలం.
అదికారిక ప్రకటన చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి..
Comments
Post a Comment