RIMC Admission notification 2021 | How to apply and more details check here...
రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ లో ఎనిమిదో తరగతి ప్రవేశాలు:
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన డెహ్రాడూన్లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్(ఆర్. ఐ. ఎం. సి) లో జూలై 2022 8వ తరగతి ప్రవేశాలకు తెలంగాణకు చెందిన ఏడవ తరగతి చదువుకున్న లేదా పాస్ అయినటువంటి బాలుర నుండి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్పిఎస్సి) ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది.
జనవరి 2022 టర్మ్, ఆర్ ఐ ఎన్ సి ఎనిమిదవ తరగతి ప్రవేశ పరీక్ష 2021 నోటిఫికేషన్ అర్హత ప్రమాణాలు:
ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఏడవ తరగతి చదువుతున్న/ ఏడవ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. అలాగే వీరి వయస్సు జూలై 1, 2021 నాటికి 11 1/2 సంవత్సరాలకు తగ్గకుండా, 13 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
అర్హత ఆసక్తి కలిగిన తెలంగాణ రాష్ట్రంలోనే ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష మరియు వైవా వాయిస్ మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 30, 2021.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు వీడియొలో 👇
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్: https://www.tspsc.gov.in/RIMC & http://www.rimc.gov.in/
Comments
Post a Comment