TSWREIS IIT/COEs Ist Screening test Hall Tickets released ‖ ప్రతిభ కళాశాలల్లో ప్రవేశాలకు స్క్రీనింగ్ టెస్ట్ హాల్ టిక్కెట్స్ విడుదల..
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇంటర్ మొదటి సంవత్సరం లో ప్రతిభ కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం (2021-22) లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను డిసెంబర్ 8 2020 విడుదల చేసింది.
నోటిఫికేషన్ వివరణ, దరఖాస్తు చేసుకునే పూర్తి విధానం కోసం వీడియొ చూడండి.
ప్రతిభ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన మొదటి స్క్రీనింగ్ టెస్ట్ యొక్క హాల్‌టికెట్లను అధికారిక వెబ్సైట్లో అప్పట్లో అందుబాటులో ఉన్నాయని ప్రకటనలో పేర్కొంది.
ప్రస్తుత విద్యా సంవత్సరం (2020-21) లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ప్రతిభ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్నారో వారు వారి హాల్‌టికెట్లను అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి డౌన్లోడ్ చేసుకోండి.
తప్పక చదవండి : SSC Public Examinations May 2021 Model Question Papers ‖ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మే - 2021 ‖ మోడల్ ప్రశ్న పత్రాలు. అన్నీ సుబ్జెక్ట్స్ లకు ఇక్కడ pdf రూపంలో అందుబాటులో ఉన్నవి.
హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన డైరెక్ట్ లింక్, అధికారిక వెబ్ సైట్ లింక్, క్రింద ఉన్నాయి చూడండి.
పరీక్ష విధానం:
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిభ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష అన్ని గ్రూపుల MPC/BiPC/MEC/CEC వారికి ఒకే విధంగా ఉంటుంది.
1. గణితం నుండి 30 మార్కులు
2. రసాయనిక శాస్త్రం నుండి 30 మార్కులు
3. జీవశాస్త్రం నుండి 30 మార్కులు
4. సాంఘిక శాస్త్రం నుండి 30 మార్కులు
5. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ మరియు గ్రామర్ నుండి 20 మార్కులు
6. జనరల్నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ నుంచి 20 మార్కులు
మొత్తం 160 మార్కులకు ఈ పరీక్ష పేపరు ఉంటుంది.
➥ ప్రవేశ పరీక్ష పదవ తరగతి సిలబస్ కు అనుగుణంగా ఉంటుంది.
➥ ఈ పరీక్షలో మొత్తం 160 మల్టిపుల్ ఛాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి.
➥ ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు.
➥ ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కును తగ్గిస్తారు.
➥ ఓఎంఆర్ షీట్ పై బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ తో మాత్రమే సర్కిల్స్ ను బబ్లింగ్ చేయాలి.
తప్పక చదవండి : TG TW Gurukulam Inter Admissions ‖ తెలంగాణ గిరిజన గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు దరఖాస్తు కు ఇంకొద్దిరోజులే అవకాశం.. దరఖాస్తు చేయండిలా..
మొదటి స్క్రీనింగ్ టెస్ట్ కు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష హాలులో పాటించవలసిన ముఖ్యమైన సూచనలు:
1. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒక గంట ముందుగానే నిర్దేశించిన పరీక్ష సెంటర్ కు చేరుకోవాలి.
2. అభ్యర్థులు పరీక్షకు వచ్చేటప్పుడు బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ లను తప్పక తీసుకురావాలి.
3. హాల్ టికెట్లో తండ్రి పేరు పుట్టిన తేదీ మొదలైన వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో సరి చూసుకొని, లేనియెడల వాటిని పరీక్ష హాలులో ఇన్విజిలేటర్ తో తగిన పత్రాలను చూపించే నామినల్ రోల్స్ ను సరి చేయించుకోవాలి.
4. పరీక్ష హాలులో అభ్యర్థులు తప్పనిసరిగా covid19 సూచనలను పాటించాలి.
5. మాస్కులు ధరించి ఎవరికివారు శానిటైజర్ ను కలిగి భౌతిక దూరాన్ని పాటించాలి.
6. పరీక్షా కేంద్రాన్ని అభ్యర్థులు కచ్చితంగా తెలుసుకోవడానికి హాల్‌టికెట్ లో ఉన్నటువంటి సెంటర్ ప్రిన్సిపాల్ కాంటాక్ట్ నెంబర్ ను సంప్రదించి తెలుసుకోండి.
హాల్‌టికెట్లను పొందడానికి ఈ క్రింది సోపానాలను పాటించండి:
1. సంబంధిత అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి
2. TSWREIS IIT/COEs ప్రతిభ కళాశాలల ప్రవేశం విద్యా సంవత్సరం 2021-22 కు సంభందించిన మొదటి స్క్రీనింగ్ టెస్ట్ హాల్ టికెట్ లింక్ పై క్లిక్ చేయండి.
3. IIT/ COEs పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ ను పొందే లింక్ పై క్లిక్ చేయండి.
4. హాల్ టికెట్ ను పొందడానికి సంబంధించిన వివరాలను ఎంటర్ చేసే పేజ్ ఓపెన్ అవుతుంది.
5. ఇక్కడ చరవాణి నెంబర్‌ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
6. హాల్ టికెట్ ప్రివ్యూ కనిపిస్తుంది.. భవిష్యత్ కార్యాచరణ కోసం (పరీక్ష రాయడానికి) ప్రింట్ భద్రపరుచుకోండి.
7. పరీక్ష తేదీ : 13.03.2021
అదికారిక వెబ్ సైట్ లింక్ : ఇక్కడ క్లిక్ చేయండి
హాల్ టికెట్ పొందడానికి డైరెక్ట్ లింక్ : ఇక్కడ క్లిక్ చేయండి
ALL THE BEST
పోటీ పరీక్షల కోసం వీడియొ డిస్క్రిప్షన్ నుండి కరోనా సంభందిత 51 ప్రశ్న కు సమాదానలతో కూడిన పిడిఎఫ్ ను పొందండి.
తప్పక చదవండి : SSC Public Examinations May 2021 Model Question Papers ‖ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మే - 2021 ‖ మోడల్ ప్రశ్న పత్రాలు.
Comments
Post a Comment