DSSSB Recruitment 2022 || Apply 691 Posts of JE And SO || Check eligibility and Selection process here..
DSSSB పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్(DSSSB) ప్రతి సంవత్సరం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ లను విడుదల చేస్తూనే ఉంది.. అదేవిధంగా, 2022 నూతన సంవత్సర కానుకగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి, తాజాగా 2 నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ రెండు ఉద్యోగ నోటిఫికేషన్ లకు సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ..
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ వివరాలను ఇక్కడ తనిఖీ చేయండి.
DSSSB-ఉద్యోగ నియామకాలు 2022:
ఢిల్లీ సబార్డినేట్ సెలక్షన్ బోర్డ్ జూనియర్ ఇంజనీర్(సివిల్)/ సెక్షన్ ఆఫీసర్(సివిల్) & జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)/ సెక్షన్ ఆఫీసర్(ఎలక్ట్రికల్) విభాగాల్లో ఉన్నటువంటి ఖాళీల భర్తీకి కంబైన్డ్ ఎగ్జామినేషన్-2022 ఆధారంగా భర్తీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు భారతీయ పౌరులు దరఖాస్తులు సమర్పించవచ్చు..
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 691,
విపరీత ఖాళీల వివరాలు:
1. జూనియర్ ఇంజనీర్(సివిల్)/ సెక్షన్ ఆఫీసర్(సివిల్) - 575,
జూనియర్ ఇంజనీర్ (సివిల్) నోటిఫికేషన్: డౌన్లోడ్ చేయండి.
2. జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రానిక్)/ సెక్షన్ ఆఫీసర్(ఎలక్ట్రానిక్) - 116.
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్) నోటిఫికేషన్: డౌన్లోడ్ చేయండి.
అర్హత ప్రమాణాలు:
భారతీయ మహిళ, పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సివిల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ సివిల్ ఇంజనీరింగ్ డిప్లమా/ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లమా ఉత్తీర్ణతతో.. సంబంధిత విభాగంలో ప్రొఫెషనల్ అనుభవం ఉండాలి.
వయసు:
పోస్టులను అనుసరించి 18 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
రిజర్వేషన్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు లు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ ను చదవండి.
ఎంపిక విధానం:
💧 జూనియర్ ఇంజనీర్/ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు రాత పరీక్ష ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
💧 రాత పరీక్ష, టయర్-1, టయర్-2 గా ఉంటుంది.
💧 రాత పరీక్ష మొత్తం 400 మార్కులకు ఉంటుంది.
💧 ఈ రెండు పరీక్షల్లో అర్హత సాధించాలి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ.100/-.
మహిళలకు, రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు మరియు మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.01.2022,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 09.02.2022.
అధికారిక వెబ్సైట్: https://dsssbonline.nic.in/
ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్: https://dsssbonline.nic.in/Registration New Form
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment