IRCTC Walk-In-Interview on 9th September 2023, Check Eligibility here..
నిరుద్యోగులకు శుభవార్త!
టూరిజం బ్యాచిలర్ డిగ్రీ తో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు IRCTC భారీ శుభవార్త చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి మూడు సంవత్సరాల ఒప్పంద ప్రాతిపదికన "టూరిజం మానిటర్" పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ అధికారికంగా నోటిఫికేషన్ ను ఆగస్టు 30, 2023న జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇంటర్వ్యూ తేదీ, వేదిక, సమయం, జీతభత్యాల వివరాలతో మీకోసం ఇక్కడ.
పోస్టుల వివరాలు :- మొత్తం పోస్టుల సంఖ్య : 03.
పోస్ట్ పేరు :: టూరిజం మానిటర్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి టూరిజం విభాగంలో 3 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- టూరిజం ఆపరేషన్/ ట్రావెల్ ఏజెన్సీ విభాగాల్లో 1 సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 31.08.2023 నాటికి 28 సంవత్సరాల పూర్తి చేసుకునే ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వం నిబంధన మేరకు 3 నుండి 10 సంవత్సరాలు వరకు సడలింపు వర్తిస్తుంది. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేపడతారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు అర్హత ప్రమాణాలు అనుభవం ఆధారంగా రూ.30,000 - 35,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
- అన్ని ఇతర అలవెన్స్ లు వర్తిస్తాయి.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు:
ఇంటర్వ్యూ వేదిక :
- IRCTC Zonal office 3.Koilaghat Street, Ground floor Kolkata - 700001.
ఇంటర్వ్యూ తేదీ :
- సెప్టెంబర్ 9, 2023.
సమయం :
- ఉదయం 09:00 గంటల నుండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.irctc.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment