e-RUPI | PM Modi lanches e-RUPI | digital payment solution.. watch live streaming video here.. and know about e-RUPI..
ఇ-రూపీ అంటే ఏంటి?
ఇది ఎలా పని చేస్తుంది?
దీని ద్వారా చెల్లింపులు చేయాలంటే ఏం చేయాలి? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
ఇండియాలో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి, వీటిని మరింత సులభతరం చేయడానికి మరొక సాధనాన్ని కేంద్ర ప్రభుత్వం నేడు ప్రవేశ పెట్ట పోతుంది.
అదే 'ఇ-రూపి'. దీనిని ఈరోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు సాయంత్రం 04:30 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు. నగదు రహిత లావాదేవీలను మరింత ప్రోత్సాహకం చేయడానికి మరియు మధ్యవర్తిత్వ సాధనాల ప్రమేయాన్ని తగ్గించడానికి లక్ష్యంగా దీనిని పరిచయం చేస్తున్నారు.
ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అత్తారింటి మొదలగు వాట్ ఇస్ సహకారంతో అభివృద్ధి చేశారు.
ఇ-రూపి అనగా?...
ఈ విధానంలో ఒక క్యూఆర్ కోడ్ లేదా ఎస్ఎంఎస్ స్ట్రింగ్ వోచర్ లను లబ్ధిదారుల మొబైల్ ఫోన్ నెంబర్ కు పంపించడం. దీనినే 'ఇ-రూపీ' గా భావించవచ్చు. ఇందులో నిర్దేశిత డబ్బును ముందే లోడ్ చేసి ఉంచుతారు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి పై గిఫ్ట్ వోచర్ లాంటివి. ఈ వోచర్ లను లబ్ధిదారులు వారికి అవసరమైన చోట అనగా సంబంధిత సేవలు వినియోగించుకునే అవకాశమున్న చోట వినియోగించుకోవచ్చు. దీనికి ఎటువంటి బ్యాంక్ ఆప్, ఆన్లైన్ బ్యాంకింగ్.. వంటే మధ్యవర్తిత్వ వేదికలు ఏవి అవసరం లేదు..
'ఇ- రూపీ' ఎలక్ట్రానిక్ ఓచర్ ను ఎలా తీసుకోవాలి?
ప్రస్తుతం కొన్ని బ్యాంకులు.. ఎన్పీసీఐతో టైఅప్ అయ్యాయి. ఆ బ్యాంకులు కస్టమర్లకు ఈ-రూపీ ఓచర్ ను అందిస్తాయి. పార్టనర్ బ్యాంకులను ముందు సర్వీస్ ప్రొవైడర్లు అప్రోచ్ అవుతారు. ప్రైవేటు, పబ్లిక్ సెక్టార్ కు చెందిన మనీ లెండర్స్ బ్యాంకుల ద్వారా తమ వినియోగదారులకు వోచర్స్ ను అందిస్తారు. వోచర్స్ ప్రకారం.. అమౌంట్ ఎంత వాడుకుంటే.. అంత అమౌంట్ ను తిరిగి వినియోగదారులు సంబంధిత మనీ లెండర్స్ ను కట్టాల్సి ఉంటుంది. కస్టమర్ ఫోన్ నెంబర్ కు వచ్చే క్యూఆర్ కోడ్ తో ఎక్కడైనా ఈ-రూపీ ద్వారా చెల్లింపులు చేసే అవకాశం ఉంటుంది.
'ఇ-రూపీ' ని కేంద్రం ప్రవేశపెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి?
నగదు రహిత చెల్లింపుల్లో లీకేజీని అరికట్టడం అనేది ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. అలాగే.. పారదర్శకంగా నగదు రహిత చెల్లింపులు ఉండాలని.. అలాగే.. ప్రభుత్వాలు ప్రారంభించే సంక్షేమ పథకాలు అసలైన లబ్ధిదారులకు మాత్రమే చేరాలని.. పలు పథకాల ద్వారా ప్రయోజనాలు పొందే లబ్ధిదారులకు ఈ-రూపీ ద్వారా చెల్లింపులు చేయనున్నట్లు తెలుస్తోంది.
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment