TS Inter First Year Marks Memos Released || Easy Download Process here..
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మార్కుల మెమో లో విడుదల:
డిసెంబర్ 2021 లో నిర్వహించినటువంటి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. చాలామంది విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరవ్వాలని కారణంగా రిజల్ట్ పర్సంటేజ్ పడిపోయింది. దీని పై సమీక్ష నిర్వహించిన టువంటి ఇంటర్మీడియట్ బోర్డ్, ప్రభుత్వ ఆదేశానుసారం మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయిన విద్యార్థుల ను కూడా, కనీసం మార్కులతో పాస్ చేస్తూ మేము లను విడుదల చేసింది.. విద్యార్థులు వారి మెమోలను డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించింది..
అలాగే రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి దరఖాస్తులను రద్దు చేసుకొని చెల్లించిన పరీక్ష ఫీజును తిరిగి పొందవచ్చునని ఇంటర్ బోర్డు కార్యదర్శి అధికారిక ప్రకటనలో తెలిపారు.. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ దరఖాస్తులను విత్డ్రా చేసుకోవడానికి సంబంధించిన అవకాశం ఈ నెల 17 వరకు అందుబాటులో ఉంటుందని.. ఎవరైతే విద్యార్థులు వారి దరఖాస్తులను విత్ డ్రా చేయదలిచాను వారు వారి అభ్యర్థనను ఆన్లైన్ ద్వారా విత్ డ్రా చేసుకొని, చెల్లించిన కళాశాల ప్రిన్సిపల్ నుంచి తిరిగి పొందవచ్చునని ఆయన విద్యార్థులకు సూచనలు ఇచ్చారు.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మార్పులు మెమోలను డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
1. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మార్కుల మెమోని డౌన్లోడ్ చేసుకోవడానికి, అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి:
2. అధికారిక వెబ్ సైట్ లింక్:
3. TSBIE IPE 2021 First Year Mark's Memo లింక్ పై క్లిక్ చేయండి.
4. మార్క్ మెమోలను డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.. మీ హాల్టికెట్ నెంబర్ ను ఎంటర్ చేసి, సబ్మిట్ పై క్లిక్ చేయండి.
5. మీ Mark's Memo ప్రివ్యూ కనిపిస్తుంది, భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
ఇదేవిధంగా IPE 2021 RV/ RC Withdraw లింక్ పై క్లిక్ చేసి, మీ హాల్టికెట్ నెంబర్ ను ఎంటర్ చేసి, మీ రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ దరఖాస్తును విత్ డ్రా చేయవచ్చు..
అధికారిక వెబ్సైట్: https://tsbie.cgg.gov.in/
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మార్కుల మెమోని డౌన్లోడ్ చేసుకోవడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
రీ వెరిఫికేషన్/ రీకౌంటింగ్ దరఖాస్తులను విత్డ్రా చేయడానికి: ఇక్కడ క్లిక్ చేయండి.








































%20Posts%20here.jpg)


Comments
Post a Comment