స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | AP GGH Staff Nurse Recruitment 2023 | Apply here..
ఇంటర్మీడియట్ తో డిప్లమా ఇన్ జనరల్ నర్సింగ్ మరియ మిడ్ వైఫరీ (లేదా) జిఎన్ఎం/ బి.ఎస్సి(నర్సింగ్)/ ఎంఎస్సి (నర్సింగ్) అర్హతలతో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కాకినాడలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(GGH) శుభవార్త చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ధ్రువపత్రాల పరిశీలన ద్వారా నియమకాలు చేపడుతున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో ప్రకటిస్తూ తాజాగా ధరఖాస్తు ఫామ్ ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం అందుబాటులోకి తెచ్చింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు కాకినాడ GGH కార్యాలయంలో నిర్దిష్ట కౌంటర్లలో ఆఫ్లైన్ దరఖాస్తులను నేరుగా 30-06-2023 సాయంత్రం 5:00 లోపు లేదా అంతకంటే ముందే సమర్పించాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య - 97.
పోస్టుల వివరాలు :
- స్టాఫ్ నర్స్ (GNM (నర్సింగ్)) - 43,
- స్టాఫ్ నర్స్ (బి.ఎస్సి (నర్సింగ్)) - 28,
- స్టాఫ్ నర్స్ (ఎం.ఎస్సి (నర్సింగ్)) - 26.
- వర్గాల వారీగా రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలు కోసం అధికారిక నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేయడానికి ముందు పూర్తిగా చదవండి
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి GNM/BSc/MSc నర్సింగ్ లో అర్హత సాధించి ఉండాలి.
- ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ మరియు మిడ్ వైఫరీ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.07.2024 నాటికి అభ్యర్థుల వయస్సు 42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు సడలింపు కోరే అభ్యర్థులు అధికారికి నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అకాడమిక్ విద్య అర్హతలో కనపరిచిన మెరిట్ ఆధారంగా, పని అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, జిల్లా నియామక సిబ్బంది ఆధ్వర్యంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- ఓసి/ బిసి అభ్యర్థులకు రూ.400/-
- ఈడబ్ల్యూ ఎస్/ ఎస్సీ/ ఎస్టి/ పిహెచ్ అభ్యర్థులకు రూ.200/-
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 19.06.2023 ఉ.10:00 నుండి,
దరఖాస్తుకు చివరి తేదీ :: 30.06.2023 సా.5:00 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://kakinada.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ : చదవండి/ డౌన్లోడ్ చేయండిచేయండి.
దరఖాస్తు చిరునామా :
కాకినాడ జిజిహెచ్ కార్యాలయంలోని నిర్దిష్ట కౌంటర్లలో సమర్పించాలి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment