APSSDC Skill Connect Drive 2022 | SSC Inter Degree PG Can Register here | Check Venu and Other Details here
రేపు లయోలా కళాశాలలో స్కిల్ కనెక్ట్ డ్రైవ్ -2022:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(APSSDC) ఆధ్వర్యంలో స్కిల్ కనెక్ట్ డ్రైవ్, నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి పి. ప్రణయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగులకు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించేందుకు రేపు అనగా;30.01.2022 న ఉదయం 10 గంటల నుంచి నగరంలోని ఆంధ్ర లయోలా కళాశాలలో "స్కిల్ కనెక్ట్ డ్రైవ్" నిర్వహిస్తున్నట్లు, ఈ అవకాశాన్ని నగరంలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, పోస్ట్-గ్రాడ్యుయేట్, ఎంబీఏ, మొదలగు అర్హతలు కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ డ్రైవ్ లో పాల్గొనడానికి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి, జాబ్ రిజిస్ట్రేషన్ కోసం పేరు నమోదు చేసుకోవాలని ఆయన వివరించారు. వివిధ కంపెనీల ప్రతినిధులు ఈ డ్రైవ్ లో పాల్గొని నేరుగా అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి, ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని తెలిపారు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి తమ పేరు నమోదు చేసుకోవాలని, అలాగే డ్రైవ్ లో పాల్గొనే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ప్రింట్ దీంతో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను తీసుకురావాలని కోరారు.
ఇతర వివరాలకు, సందేహాలు నివృత్తి కోసం 9603748760 నెంబర్ను సంప్రదించాలన్నారు.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
1. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నిర్వహిస్తున్న టువంటి ఈ జాబ్ మేళాకు హాజరవడానికి అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
2. అధికారిక వెబ్ సైట్ లింక్:
3. పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్, చిరునామా, జాబ్ మేళా డ్రైవ్ లను ఎంపిక చేసి రిజిస్ట్రేషన్ను విజయవంతం చేయండి.
💧ఇతర సంధెహాలకోసం: Comment 💬 చేయండి. elearningbadi.in మీ సంధెహాలకు స్పందిస్తుంది.
అధికారిక వెబ్సైట్: https://apssdc.in/
రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్: https://www.apssdc.in/home/jobSeekerRegistration
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment