TS EDCET 2021 Seat Allotment List Results Out || Check your Name, Rank, Allotted College here..
తెలంగాణ బిఈడి ప్రవేశాలకు సంబంధించిన, ఫేస్-1 సీట్ అలాట్మెంట్ లిస్ట్ విడుదల. టీఎస్ ఎడ్‌సెట్ 2021 ప్రవేశాల లో భాగంగా 2021 22 విద్యాసంవత్సరానికి బీఈడీ శిక్షణ లో జాయిన్ అవ్వడానికి సంబంధించినటువంటి ఫేస్-1 అభ్యర్థుల జాబితాను తాజాగా విడుదల చేసింది.
బీఈడీ లో సీట్లు పొందిన విద్యార్థులు జాబితాను కాలేజీ పేర్లతో ఇక్కడ తనిఖీ చేయండి.
ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీ లా పరిధిలోని బీఈడీ కాలేజీ లో సీట్లు సాధించిన విద్యార్థుల తొలి జాబితాను తాజాగా విడుదల చేసింది. మొదటి విడత ఎడ్‌సెట్ -2021 కౌన్సెలింగ్ లో భాగంగా మొత్తం 14,464 కన్వీనర్ కోటా సీట్లకు గాను 17,417 వెబ్ ఆప్షన్ ఆన్లైన్ ద్వారా సమర్పించారు. వారిలో నుండి 10,216 విద్యార్థులకు 2021 22 విద్యా సంవత్సరానికి గాను బీఈడీ లో ప్రవేశాలకు సీట్లు కేటాయించినట్లు కన్వీనర్ రమేష్ బాబు వెల్లడించారు.
సీట్లు పొందిన అభ్యర్థులు జాయినింగ్ లెటర్, స్పీడ్ చలానా నో డౌన్లోడ్ చేసుకొని ఏదైనా జాతీయ బ్యాంకుల్లో ట్యూషన్ ఫీజు సకాలంలో చెల్లించే, సీట్ రిజర్వేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు. తదుపరి ఈ నెల 27 నుండి 30వ తేదీ వరకు కాలేజీలలో ఒరిజినల్ అర్హత ధ్రువపత్రాలను వెరిఫికేషన్ చేయించుకోవాలని.. డిసెంబర్ 30, 2021 నుండి బీఈడీ తరగతులు ప్రారంభం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
బీఈడీ మొదటి విడత సీట్ల కేటాయింపు వివరాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
1. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
2. మెయిన్ మెనూ లో కనిపిస్తున్న టువంటి తెలంగాణ బీఈడీ అడ్మిషన్స్ 2021 లింక్ పై క్లిక్ చేయండి.
3. బీఈడీ 2021 ప్రవేశాలకు సంబంధించినటువంటి పేజీ ఓపెన్ అవుతుంది, అందులోని బీఈడీ మొదటి విడత సీట్ల కేటాయింపు లింక్‌పై క్లిక్ చేయండి.
4. కళాశాలల వారీగా తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితా చూడడానికి, కాలేజ్ డ్రాప్ డౌన్ లింక్ పై క్లిక్ చేసి, సంబంధిత కాలేజ్ ను ఎంపిక చేసి, మీ పేరు, మీ ర్యాంక్, మీ హాల్‌టికెట్ నెంబర్ ను తనిఖీ చేయండిచేయండి.
అధికారిక వెబ్ సైట్ : https://edcet.tsche.ac.in/
మొదటి విడత ఎడ్‌సెట్ -2021 సీట్ల కేటాయింపు వివరాలు తనిఖీ చేయడానికి డైరెక్ట్ లింక్: https://edcetadm.tsche.ac.in/
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment