NIRDPR Recruitment 2022 || పంచాయితీ రాజ్ నుండి వివిద ఉద్యోగాల భర్తీకి ప్రకటన || అర్హత ప్రమాణాలను ఇక్కడ తనిఖీ చేయండి..
హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మరియు పంచాయతీరాజ్ (NIRDPR) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 17
విభాగాల వారీగా ఖాళీలు:
💦మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 1,
💦ట్రైనింగ్ మేనేజర్(అడ్మినిస్ట్రేషన్ మరియు అకౌంట్) - 1,
💦ట్రైనింగ్ మేనేజర్ - 3,
💦రీసెర్చ్ అసిస్టెంట్ - 12.. మొదలగునవి.
విద్యార్హత: పోస్టులను అనుసరించి పదవ తరగతి, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి విద్యార్హతతో సంబంధిత విభాగంలో అనుభవం కలిగి, 30 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు: లేదు.
దరఖాస్తు విధానం:
💧దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
💧దరఖాస్తు విధానం రెండు దశల్లో ఉంటుంది.
💧మొదటిదశలో రిజిస్ట్రేషన్.
💧రెండవ దశలో దరఖాస్తు పూరించడం.
💧రిజిస్ట్రేషన్ లో భాగంగా అభ్యర్థులు, ఏ పోస్టులకు అప్లై చేస్తున్నారో పేర్కొనాలి, పుట్టిన తేదీ, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, తదుపరి లాగిన్ అవ్వడానికి పాస్వర్డ్, ఇక్కడ తయారు చేసుకోవాలి.
💧రిజిస్ట్రేషన్ పూర్తవగానే, సంబంధిత వివరాలతో లాగిన్ దరఖాస్తు విజయవంతంగా సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 26.01.2022.
అధికారిక వెబ్సైట్: http://nirdpr.org.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్ : http://career.nirdpr.in/
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment