JNVST 6th Results 2022 | జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన పరీక్ష ఫలితాలు ఎప్పుడో తెలుసుకోండి..
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జవహర్ నవోదయ విద్యా సంస్థల్లో విద్యా సంవత్సరం 2022-23 కు గాను 6వ తరగతి ప్రవేశాలకు ఆసక్తి కలిగిన ఐదవ తరగతి చదువుతున్న అభ్యర్థులను ఉండే ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించడానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ 30.11.2022 న ముగిసింది. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డు లను విడుదల చేసి, ప్రవేశ పరీక్షను 30.04.2022 న నిర్వహించింది. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన అధికారిక KEY JNVST అధికారిక నోటీసు ప్రకారం.. జూన్ ఆరవ తేదీన విడుదల కానుంది. అనంతరం మరికొద్ది రోజుల్లో ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఫలితాలను కూడా ప్రకటించనున్నట్లు JNVST స్పష్టం చేసింది.
ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు గాను, 80 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు, 2:30 గంటల వ్యవధిలో ఈ పరీక్ష నిర్వహించారు..
★ విభాగాల వారీగా చూసినట్లయితే..
◆ మెంటల్ ఎబిలిటీ - 40,
◆ గణితం- 20,
◆ లాంగ్వేజ్ - 20.
జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష కు దాదాపు 2.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు..
సూచన: ప్రముఖ కోచింగ్ సెంటర్ లో తయారు చేసినటువంటి, జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష KEY :: ఇక్కడ క్లిక్ చేసి తనిఖీ చేయవచ్చు.
JNVST ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ మొదటిగా JNVST అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్:
◆ హోం పేజీలో కనిపించే JNVST - VI RESULTS-2022, లింక్ పై క్లిక్ చేయండి.
◆ మీరు ఇప్పుడు ఫలితాలు తనిఖీ చేయడానికి సంబంధించిన పేజీ లోకి రీ-డైరెక్టర్ అవుతారు.
◆ ఇక్కడ సంబంధిత LOGIN వివరాలు నమోదు చేసి SUBMIT బటన్ పై క్లిక్ చేయండి.
◆ విద్యార్థికి సంబంధించిన ఫలితాలు తెరపై ప్రత్యక్షం అవుతాయి.
◆ భవిష్యత్ కార్యాచరణ కోసం సంబంధిత JNVST ఆరవ తరగతి ఫలితాల కాపీని, డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.
మరిన్ని తాజా విద్యా ఉద్యోగ సమాచారం కోసం :: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
అధికారిక వెబ్సైట్: https://navodaya.gov.in/
JNVST 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు 2022 డౌన్లోడ్ చేయడానికి Direct Link త్వరలో అప్ డేట్ చేయబడుతుంది.
★ ఇలాంటి మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం చదవడానికి మన eLearningBADI.in నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి.
Comments
Post a Comment