Midhani Primary Health Care Center Trust Recruitment 2021 | Apply Varius Medical Staff Posts | Exam not Required | Just Attempt Interview Only.. Read more details here...
హైదరాబాద్లోని మిశ్రమ ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంట్రల్ ట్రస్ట్ లలో ఖాళీగా ఉన్న వివిధ వైద్య సిబ్బంది నియామకాలకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
ఇంటర్వ్యూ తేదీలు: అక్టోబర్ 7 నుండి 19 వరకు.
కాంట్రాక్ట్ వ్యవధి: 2 సంవత్సరాలు, అభ్యర్థుల పనితీరు మరియు ట్రస్ట్ అవసరాలను బట్టి 1 సంవత్సరం పెంచుతారు. ఈ పోస్టులకు ప్రతి సంవత్సరం 8% ఇంక్రిమెంట్ ను కల్పిస్తారు.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 09
1. సీనియర్ మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ - 1,
2. మెడికల్ ఆఫీసర్ - 1,
3. సీనియర్ నర్స్ - 1,
4. నర్స్ - 2,
5. ల్యాబ్ టెక్నీషియన్ - 2,
6. ఫార్మసిస్ట్ - 1,
7. రిసెప్షనిస్ట్ కమ్ డాటా ఎంట్రీ ఆపరేటర్ (పురుష) - 1..
విద్యార్హత: వివిధ రకాల పోస్టులకు వివిధ రకాల విద్యార్హతలను కలిగి ఉండాలి. పోస్టులను అనుసరించే ఇంటర్మీడియట్+ జిఎన్ఎం, ఫార్మసీలో డిప్లమా, బీఎస్సీ నర్సింగ్, బీకాం, ఎంబిబిఎస్, ఎండి/ డిఎంబి ఉత్తీర్ణత కలిగి, సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
వయసు: సెప్టెంబర్ 22, 2021 నాటికి 30 సంవత్సరాల నుండి అరవై ఐదు సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
జీతభత్యాలు: పోస్టులను అనుసరించి రూ.25,000/- నుండి 1,20,000/- వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
వేదిక:
1. మిధాని కార్పొరేషన్ ఆఫీస్, పి ఓ కాంచన్ బాగ్ హైదరాబాద్.
2. బిపిడిఏవి స్కూల్, మెకానిక్ టౌన్షిప్, వివో కాంచన బాగ్ హైదరాబాద్.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు వీడియొలో..👇
అధికారిక వెబ్సైట్: https://midhani-india.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
Comments
Post a Comment