TSLPRB SI Hall Tickets Out | తెలంగాణ పోలీస్ నియామక బోర్డు ఎస్సై పరీక్ష హాల్ టికెట్లు విడుదల..
TSPLRB SI ప్రాథమిక పరీక్ష హాల్ టికెట్లు విడుదల..
TSLPRB - ఆగస్ట్ 7న నిర్వహించనున్న TSPLRB SI ప్రాథమిక పరీక్ష హాల్ టికెట్లు, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి..
తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక ప్రక్రియలో భాగంగా ఎస్ఐ పోస్టుల భర్తీకి నిర్వహించే ప్రాథమిక రాత పరీక్షా హాల్ టికెట్లను పోలీస్ నియామక బోర్డు, అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి, హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని బోర్డు చైర్మన్ వి వి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.. అదేవిధంగా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని సూచనలు చేశారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఈ రాత పరీక్షలో నెగిటివ్ మార్పులు ఉంటాయని నిరుద్యోగ యువతకు ఈ సందర్భంగా సూచనలు చేశారు..
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 554 పోస్టులకు 2,47,217 దరఖాస్తులు వచ్చినట్లు బోర్డు తెలిపింది.. ఈ ఎస్సై ఉద్యోగం నియామకాలకు సంబంధించిన ప్రాథమిక పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా మొత్తం హైదరాబాద్‌తో సహా 503 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే సమయంలో అభ్యర్థులు ఏదైనా ఇబ్బందులకు గురి అయితే 9393711110, 9391005006 నెంబర్లకు సంప్రదించాలని, అలాగే హాల్ టికెట్ పై పాస్ పోర్ట్ సైజు ఫోటో అంటించి, పరీక్షలకు హాజరు కావాలని, పరీక్షా సమయంలో అభ్యర్థుల డిజిటల్ ఫింగర్ ప్రింట్ తీసుకుంటారని తెలిపారు..
TSPLRB SI ప్రాథమిక పరీక్ష హాల్ టికెట్లు డౌన్లోడ్ చేయడం ఎలా?.
TSPLRB SI ప్రాథమిక పరీక్ష హాల్ టికెట్లు సులభంగా డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ :: http://www.tslprb.in/
◆ హోం పేజీలోని Download Hall Ticket లింక్ పై క్లిక్ చేయండి.
◆ ఇప్పుడు మీరు TSPLRB SI ప్రాథమిక పరీక్ష హాల్ టికెట్లు డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీ లోకి కర్రీ డైరెక్ట్ అవుతారు.
◆ మీ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ లను నమోదుచేసి Sign in పై క్లిక్ చేయండి.
◆ TSPLRB SI ప్రాథమిక పరీక్ష హాల్ టికెట్ ప్రివ్యూ కనిపిస్తుంది, భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్సైట్:: http://www.tslprb.in/
డైరెక్ట్ గా TSPLRB SI ప్రాథమిక పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
తాజా విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ను యాక్టివేట్ చేసుకోండి.. ప్రతి నోటిఫికేషన్ మీ మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment