PM KISAN Samman Nidhi 7th Term fund is released. Check out the Beneficiary Account Status throuthrough Aadhaar number @ pmkisan.gov.in
రైతులకు శుభవార్త!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అందిస్తున్న P.M కిసాన్ పథకం డబ్బులు రూ. 2000/- అర్హులైన రైతుల బ్యాంక్ ఎకౌంట్ ఖాతాలలో జమ కానున్నవి. మీకు డబ్బులు జమ అయినవో! కాలేదో! అతి సులభంగా ఇక్కడ తెలుసుకోండి.
- ఈ పథకం 01.12.2018 నుండి ప్రారంభించబడింది.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క ఏడవ (7వ) విడత డిసెంబర్ 01 నుండి ప్రారంభమైనది. ఈ పథకం కింద సంవత్సరానికి రూ. 6000/- ను కేంద్ర ప్రభుత్యం మూడు (3) విడతలుగా అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.
- మొదటి విడత డిసెంబర్ 01 నుండి మార్చి 31 వరకు.
- రెండవ విడత ఏప్రిల్ 01 నుండి జూలై 31 వరకు.
- మూడవ విడత ఆగస్టు 01 నుండి నవంబర్ 30 వరకు. ఒక్కొక్క విడతలో రూ.2000/- చొప్పున సంవత్సరానికి రూ. 6000/- ను కేంద్ర ప్రభుత్యం రైతులకు సహాయంగా అందిస్తుంది.
మీ రికార్డు ను తనిఖీ చేయండి, తద్వారా P.M కిసాన్ పథకం యొక్క సహాయాన్ని పొందండి. రికార్డు లో ఏదైనా అవాంతరాలు ఉంటే ఖచ్చితంగా మీకు ఈ పథకం యొక్క ప్రయోజనం (సహాయం) లభించదు. దరఖాస్తు చేసుకున్నా కొందరికి ఇలా జరిగి ఉండవచ్చు. ఏ కారణం చేత సహాయం అందలేదో తెలుసుకోండి.
- మీ బ్యాంక్ ఖాతాలో విడతలవారిగా P.M కిసాన్ సమ్మాన్ నిధి పథకం డబ్బులు జమ అవుతున్నావో! లేదో! చూడటానికి ఈ క్రింది విడనాన్ని అనుసరించండి.
- అదికారిక వెబ్ సైట్ https://pmkisan.gov.in/ను సందర్శించండి.
- తరువాత మెయిన్ మేను లో ని ఫార్మర్ కార్నర్ కు రండి.
- అక్కడ కనిపిస్తున్న బెనిఫిషరీ స్థితి పై క్లిక్ చేయండి.
- తరువాత ఆధార్ నెంబర్, అకౌంట్ నెంబర్, ఫోన్ నెంబర్ ను ఎంటర్ చేసి వివరాలను చూసుకునే పేజి వస్తుంది.
- పై మూడింటిలో మీ దగ్గర అందుబాటులో ఉన్న వివరాలను ఎంటర్ చేసి గెట్ డాటా పై క్లిక్ చేయండి.
- మీరు ఇప్పటి వరకు పొందిన P.M కిసాన్ సమ్మాన్ నిధి యొక్క పూర్తి వివరాలు విడతల వారీగా చూడండి.
- మీ పేరును బెనిఫిషరీ లిస్ట్ లో ఉందో! లేదో! ఈ క్రింది విదానాన్ని అనుసరించి తెలుసుకోండి.
- అదికారిక వెబ్ సైట్ https://pmkisan.gov.in/ ను సందర్శించండి.
- పేజీ ఓపెన్ అయిన తరువాత మేను బార్ లో కుడి వైపున ఉన్న ఫార్మర్ కార్నర్ కు వెళ్ళండి.
- లబ్దిదారుల జాబితా (Beneficiary List) పై క్లిక్ చేయండి.
- రాష్ట్రం, జిల్లా, ఉప-జిల్లా, గ్రామము ను ఎంచుకునే పేజ్ ఓపెన్ అవుతుంది.
- పై వివరాలను ఎంటర్ చేసి గెట్ రిపోర్ట్ పై కిక్ చేయండి.
- ఎలా మే వివరాలను చూసుకోవచ్చు.
- సహాయం కోసం ఈ వీడియో ను చూడండి.
- హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోండి.
- P.M కిసాన్ హెల్ప్ లైన్ నెంబర్ : 155261
- P.M కిసాన్ టోల్ ఫ్రీ నెంబర్ : 18001155266
- P.M కిసాన్ ల్యాండ్ లైన్ నెంబర్ ; 011-23381092, 23382401
- P.M కిసాన్ మరొక హెల్ప్ లైన్ నెంబర్ : 0120-6025109
- ఇమెయిల్ ఐడి : pmkisan-ict@giv.in
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలు 2020
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ చట్టాలు 2020.pdf
The Gazette of India 1 : Click here
The Gazette of India 2 : Click here
The Gazette of India 3 : Click here
రైతు ఉత్పత్తుల వాణిజ్య-వర్తక (ప్రోత్సాహ- సౌలభ్యం) బిల్లు 2020 : Click here
Putting farmers First Pdf : Click here






































Comments
Post a Comment