SSC Study Material 2021 ‖ 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటేరియల్.. ‖ డౌన్లోడ్ చేయండిలా...
మార్చి 2021 లో జరిగే పదవ తరగతి పరీక్షల కోసం సిద్దం అవుతున్న విద్యార్థుల కోసం మాన్యువల్ పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాదించాలన్న మంచి ఉద్దేశం తో ఈ స్టడీ మెటిరియల్స్ ను రూపొందించినట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి గారు తెలిపారు.
ఈ స్టడీ మెటిరియల్స్ ను మంత్రి గారు మంగళవారం(06.04.2021) విడుదల చేశారు.
ఈ స్టడీ మెటిరియల్స్ కార్పొరేట్ విద్యాసంస్థలు రూపొందించే నోట్స్ కన్నా సులభ స్థాయి లో అద్భుతంగా ఉన్నాయని ప్రశంశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు, ఇంగ్లిష్, ఉర్దు మాద్యమాల్లో రూపొందించమని పేర్కొన్నారు.
ఈ స్టడీ మెటిరియల్స్ ను విద్యార్థులు అందుబాటులో ఉండేవిధంగా ఎస్సిఈఆర్టి వెబ్ సైట్ https://scert.telangana.gov.in/ లో ఉంచామని పేర్కొన్నారు.
ఇంగ్లిష్ మీడియం లో చదువుతున్న విద్యార్థులకు మాతృ భాషలో సాంకేతిక పదాలను నేర్చుకోవడానికి భాహుభాషా నిఘంటువును రూపొందించామని తెలిపారు.
గణితం, భౌతిక, రసాయన, జీవ, సాంఘిక శాస్త్రాల్లోని సాంకేతిక పదాలు తెలుగు, ఇంగ్లిష్, హింది, కన్నడ, మరాఠి, తమిళం భాషల్లో అందుబాటులో ఉన్నట్లుగా ప్రకటనలో తెలిపారు. ఇది రాష్ట్ర విద్యా పరిశోదన, శిక్షణ మండలి(ఎస్సిఈఆర్టి) చరిత్రలో మీలు రాయిగా నిలుస్తుందని, ఈ కార్యక్రమములో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, పాఠశాల విద్యా సంచాలకులు శ్రీదేవ సేన, ఎస్సిఈఆర్టి సంచలకురాలు రాధారెడ్డి పాల్గొన్నారు.






































Comments
Post a Comment