Ugadi 2021 ‖ ఉగాది పండుగ విశిష్టత, ఆచార సాంప్రదాయాలు, పుట్టు పూర్వోత్తరాలు ‖ శ్రీ ప్లవ నామ ఉగాది శుభసంక్షలు @elearningbadi.in
ఉగాదిని ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిధి నాడు వస్తుంది. తెలుగు వారికి ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది.
ఉగాది పండుగ విశిష్టత, ఆచార సాంప్రదాయాలు, పుట్టు పూర్వోత్తరాలు:
ఉగాది పండుగ ప్రాముఖ్యత:
ఉగాది పచ్చడిలో ఆరు రుచులు ఉంటాయి. బెల్లం, మామిడి, వేపపువ్వు, చింతపండు, వాము, ఉప్పు కలిపి పచ్చడి తయారుచేస్తారు.
ఉగాది ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తు.కు వచ్చేది మన మొదటి పండుగ ఉగాది అని. ఉగాది పర్వ దినం నుండి తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొట్ట మొదటి పండుగ. ఈ రోజు కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహ శాంతి పూజలు లాంటివి ఉంటే వాటిని జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని పఠనం చేస్తారు.
ఆ నటి కాలం నుంచి వస్తున్న పండుగల్లో ముఖ్యమైన పండుగ మన ఉగాది పండుగ. ఈ పండుగ సాధారణంగా మార్చి నెల చివరి వారం లో లేదా కొన్ని సార్లు ఏప్రిల్ నెలలో రావడం జరుగుతుంది. ఉగాది అనేది ఒక్క రోజు పండుగ. తెలుగు ప్రజలు మాత్రమే కాక మరాఠీలు గుడి పడ్వాగా అనే పేరు తో, తమిళులు పుత్తాండు గా, మలయాళీలు విషు గా, సిక్కులు వైశాఖీ గా, బెంగాలీలు పొయ్లా బైశాఖ్ అనే పేరుతో ఈ నూతన సంవత్సర పండుగ ని వైభవంగా నిర్వహించుకుంటారు..
ఉగాది అనే పదం "ఉగస్య" అనే పదం నుండి ఏర్పడింది. ఉగ అనగా నక్షత్ర గమనం అని మరియు జన్మ, ఆయుష్షు అని కూడా అర్థాలు ఉన్నాయి. "ఆది" అంటే మొదలు లేదా ప్రారంభం అని అర్థం. అంటే ఉగాది అనగా ప్రపంచం యొక్క జన్మ మరియు ఆయుష్షులకు మొదటి రోజు కనుక ఉగాది అయ్యింది. భారత దేశ ఆచార, సాంప్రాదాయాల ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడు అంటే ఈ ఉగాది రోజునే సృష్టి ఆవిర్భావం జరిగిందని పురాణాల ఆదారంగా చెప్పడం వేశేషం.
ఈ ఉగాది పండుగ చైత్ర మాసంలో వస్తుంది. ఈ మాసంలో పక్షుల కిలకిలలతో, ఆకుల చిగురులుతో, కోకిల సుస్వరాల రాగాలతో, పూల పరిమళాలతో పచ్చదనం తో అందంగా కొత్తగా ఉంటుంది ఈ సమస్త ప్రకృతి. అయితే ఈ ప్రకృతి అందం ప్రత్యక్షంగా, మరియు పరోక్షంగా, కవి కలంలో, ఉగాది పాటల్లో కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చే తెలుగు సంవత్సరం ప్లవ నామ సంవత్సరం. ఆకురాల్చే శిశిర ఋతువు తర్వాత వసంతం వస్తుంది. ఈ సమయంలో ప్రకృతి ఎంతో శోభాయమానంగా ఉంటుంది. ఈ రోజు నుండే తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి తెలుగు వారు ఈ పండుగని బాగా జరుపుకుంటారు. ఇది సంవత్సరం లో వచ్చే మొదటి పండుగ కనుక కొత్తగా పనులని ప్రారంభిస్తారు.
పండుగ రోజు ప్రజలు చక్కగా తెల్లవారే నిద్ర లేచి ఇల్లు, పరిసరాల ను శుభ్ర పరుచుకుని, మామిడి తోరణాలతో అలంకరించి, తల స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. అలానే ఈ రోజు అన్నింటి కంటే ముఖ్యమైనది ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడిని వివిద ప్రాంతాల వాళ్ళు వివిద రకాలుగా చేసుకుంటారు. అయితే ఇందులో ప్రత్యేకమైనవి షడ్రుచులు. మధురం,కషాయం, ఆమ్లం, లవణం, కటు, తిక్త. ఇలా ఈ ఆరు రుచులు ఉగాది పచ్చడిలో ప్రదానమైనవి. ఈ ఆరు రుచుల లో మొదటిది మధురం అంటే తీపి, రెండవది ఆమ్లం అంటే పులుపు, మూడవది లవణం అంటే ఉప్పు , నాల్గవది కటు అంటే కారం, ఐదవది తిక్త అంటే చేదు, ఆరవడి కషాయం అంటే వగరు. షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి. ఎదురయ్యేది కష్టమైన సుఖమైనా సంయమనంతో ప్రతి ఒక్కరు స్వీకరించాలి అని మన ఉగాది పచ్చడి తెలియచేస్తుంది. అందరూ ఒకేలా కాకుండా ఒకొక్కరు ఒక్కో విధంగా ఈ పచ్చడిని తయారు చేస్తారు. అయితే ఈ పచ్చడిలో చెరకు అరటి పళ్ళు, మామిడి కాయలు, చింతపండు, వేప పువ్వు, జామ కాయలు, బెల్లం వగైరా పదార్దాలను వాడుతారు. హిందువులు కి అత్యంత శ్రేష్ఠమైన పండుగ ఇది.
ఉగాది పచ్చడి ప్రాముఖ్యత:
ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంతో చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అనేది మొత్తంగా అన్నీ అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అవుతుందని తెలిపే భావం ఇందులో ఇమిడి ఉంటుంది. కాబట్టి పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీకలు.
బెల్లం – తీపి – ఆనందానికి సంకేతాలు
ఉప్పు – జీవితంలో – ఉత్సాహమ, రుచికి సంకేతాలు
వేప పువ్వు – చేదు - బాధకలిగించే అనుభవాలను
చింతపండు – పులుపు – నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులను
మామిడి – పచ్చి ముక్కలు – వగరు – కొత్త సవాళ్లు ను
కారం – సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు ను ప్రతిభింభిస్తాయి.
తెలుగు సంవత్సరాల పేర్లు... వాటి అర్థాలు
1. ప్రభవ అంటే... ప్రభవించునది... అంటే... పుట్టుక.
2. విభవ - వైభవంగా ఉండేది.
3. శుక్ల... అంటే తెల్లనిది. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక.
4. ప్రమోదూత.... ఆనందం. ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత.
5. ప్రజోత్పత్తి... ప్రజ ఆంటే సంతానం. సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి.
6. అంగీరస... అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది అని అర్థం.
7. శ్రీముఖ... శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్ధం.
8. భావ.... భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు.
9. యువ.... యువ అనేది బలానికి ప్రతీక.
10. ధాత... అంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు.
11. ఈశ్వర... పరమేశ్వరుడు.
12. బహుధాన్య... సుభిక్షంగా ఉండటం.
13. ప్రమాది... ప్రమాదమున్నవాడు అని అర్థమున్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు.
14. విక్రమ... విక్రమం కలిగిన వాడు.
15. వృష ... చర్మం.
16. చిత్రభాను... భానుడంటే సూర్యుడు. సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించటం. చిత్రమైన ప్రకాశమంటే మంచి గుర్తింపు పొందడమని అర్థం.
17. స్వభాను... స్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం
18. తారణ... తరింపచేయడం అంటే దాటించడం. కష్టాలు దాటించడం, గట్టెక్కించడం అని అర్థం.
19. పార్థివ... పృధ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికున్నంత సహనం, పనిచేసేవాడని అర్థం.
20. వ్యయ... ఖర్చు కావటం. ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చై ఉంటుందని ఈ సంవత్సరం అర్థం.
21. సర్వజిత్తు.... సర్వాన్ని జయించినది.
22. సర్వధారి -...సర్వాన్ని ధరించేది.
23.విరోధి.... విరోధం కలిగినట్టువంటిది.
24. వికృతి... వికృతమైనటువంటిది.
25. ఖర.... గాడిద, కాకి, ఒక రాక్షసుడు, వాడి, వేడి, ఎండిన పోక అనే అర్థాలున్నాయి.
26. నందన ... కూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలుగజేసేది.
27. విజయ... విశేషమైన జయం కలిగినది.
28. జయ.... జయాన్ని కలిగించేది.
29. మన్మథ... మనస్సును మధించేది.
30. దుర్ముఖి... చెడ్డ ముఖం కలది.
31. హేవిలంబి... సమ్మోహన పూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం.
32. విలంబి... సాగదీయడం.
33. వికారి.... వికారం కలిగినది.
34. శార్వరి... రాత్రి.
35. ప్లవ... తెప్ప. కప్ప, జువ్వి... దాటించునది అని అర్థం.
36. శుభకృత్... శుభాన్ని చేసి పెట్టేది.
37. శోభకృత్... శోభను కలిగించేది.
38. క్రోధి... క్రోధాన్ని కలిగినది.
39. విశ్వావసు... విశ్వానికి సంబంధించినది.
40. పరాభవ ... అవమానం.
41. ప్లవంగ... కోతి, కప్ప.
42. కీలక.... పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య.
43. సౌమ్య... మృదుత్వం.
44. సాధారణ... సామాన్యం.
45. విరోధికృత్... విరోధాలను కలిగించేది.
46. పరీధావి... భయకారకం.
47. ప్రమాదీచ... ప్రమాద కారకం.
48. ఆనంద... ఆనందమయం.
49. రాక్షస... రాక్షసత్వాన్ని కలిగినది.
50. నల.... నల్ల అనే పదానికి రూపాంతరం.
51. పింగళ... ఒక నాడి, కోతి, పాము, ముంగిస.
52. కాలయుక్తి... కాలానికి తగిన యుక్తి.
53. సిద్ధార్థి... కోర్కెలు సిద్ధించినది.
54. రౌద్రి... రౌద్రంగా ఉండేది.
55. దుర్మతి... దుష్ట బుద్ధి.
56. దుందుభి ... వరుణుడు.
57. రుధిరోధ్గారి... రక్తాన్ని స్రవింప చేసేది.
58. రక్తాక్షి... ఎర్రని కన్నులు కలది.
59. క్రోదన... కోప స్వభావం కలది.
60. అక్షయ... నశించనిది
నూతన తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు








































Comments
Post a Comment