పాత ఫోన్ వాట్సాప్ డేటాను కొత్త ఫోన్ లో తిరిగి పొందండిలా?..
ప్రముఖ చాటింగ్ యాప్ వాట్స్అప్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఇప్పటికే మొదటి స్థానంలో ఉంది, అంటే అర్థం చేసుకోవచ్చు దానికి ఎంత ఆదరణ ఉంది అనేది. ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ లో ఖచ్చితంగా వాట్సప్ ఉంటుంది. దీని ద్వారా చాటింగ్, వీడియో, ఆడియో, పిడిఎఫ్ లాంటి ఇతర సౌకర్యాలు ఉన్నాయి. ఒకరి నుంచి మరొకరికి సమాచారాన్ని షేర్ చేసుకోవడానికి ప్రధానంగా వాట్స్అప్ ఉపయోగిస్తున్నాము. ఎప్పుడైనా మొబైల్ ఫోన్/ ఎవరైనా తస్కరించినపుడు అందులోనే విలువైన డేటా పోతుంది. ఒకవేళ మీ మొబైల్ ఇతరులకు చిక్కిన వాట్సాప్ ను ఆక్సెస్ చేయకుండా ఉండటానికి టూ-స్టెప్-వెరిఫికేషన్ ఆన్ చేసుకోవాలి. దీనివల్ల వారు మన డేటాను తస్కకరించలేరు. ఒకవేళ మనం డేటా ను తిరిగి వేరే మొబైల్ లో లేదా పాత ఫోన్ లో ఉన్న డేటా కొత్త ఫోన్ లో ఉన్న డేటా ను తిరిగి పొందాలన్న ఖచ్చితంగా బ్యాకప్ చేసుకోవాలి. తద్వారా పోయిన మొబైల్ లో ఉన్నా డేటాని తిరిగి పొందాలన్న, మీరు కొత్త ఫోన్ కుమారి నా మీ డేటాను పునరుద్ధరించవచ్చు.
వాట్సాప్ డేటా బ్యాక్ అప్ కోసం ఈ స్టెప్స్ ను ఫాలో అవ్వండి.
1. మీ ఫోన్లోనే వాట్స్అప్ యాప్ ఓపెన్ చేసి స్క్రీన్ కుడి ఎగువ మూలలో ఉన్న సెట్టింగ్స్ ఆప్షన్ను ఎంచుకోండి.
2. సెట్టింగ్స్ లోని 'చాట్స్' ఆప్షన్ పై క్లిక్ తరువాత 'చాట్ బ్యాకప్' ఓపెన్ అవుతుంది.
3. గూగుల్ డ్రైవ్ లో మీ చాటింగ్ మొత్తాన్ని బ్యాకప్ చేయడానికి ' చాట్ బ్యాకప్' ఆప్షన్ మీకు అనుమతి వస్తుంది.
4. ఇక్కడ రోజు, వారానికి, నెలకు ఒకసారి బ్యాక్అప్ చేసే అవకాశం ఉంటుంది.
మీకు కావలసిన ఆప్షన్ ను ఎంపిక చేసుకోండి.
5. ఒకసారి బ్యాక్అప్ చేయాలనుకుంటే ' వీక్లీ' ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.
6. వై-ఫై, సెల్ సెల్యూలర్ ద్వారా బ్యాక్అప్ చేసుకోవచ్చు.
7. వీడియోలను కూడా బ్యాకప్ చేయాలనుకుంటే 'ఇంక్లుడ్ వీడియోస్' ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి.
8. గూగుల్ డ్రైవ్ సెట్టింగ్స్ అన్నింటినీ పూర్తి చేశాక తర్వాత గ్రీన్ కలర్ లో ఉన్న ' బ్యాకప్ బటన్ పై క్లిక్ చేయండి.
9. ఇప్పుడు మీ డేటా మొత్తం గూగుల్ డ్రైవ్ లో బ్యాకప్ అవుతుంది.
కొత్త ఫోన్ లో వాట్సాప్ చాట్ బ్యాకప్ తిరిగి పొందడం ఎలా?
1. ప్లే స్టోర్ నుంచి కొత్త వర్షన్ వాట్సప్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి.
2. తర్వాత, మీ మొబైల్ లో కాంటాక్ట్స్, ఫోటోలు, వీడియోలు, ఫైల్స్ ను యాక్సెస్ చేయడానికి వాట్సాప్ అనుమతివ్వాలి.
3. ఇప్పుడు ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేయండి.
4. ఆ తర్వాత మీకు ఫోన్ లో 6-అంకెల వెరిఫికేషన్ కోడ్ ను మెసేజ్ ద్వారా వచ్చిన వెంటనే అది ఆటోమేటిక్ గా వెరిఫికేషన్ పూర్తవుతుంది.
5. మీ వాట్సాప్ నెంబర్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత, ' రీస్టోర్ బ్యాక్ ప్' ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
6. ఇలా క్లిక్ చేసిన వెంటనే గూగుల్ క్లౌడ్ లోని ఉన్న మీ వాట్సాప్ డేటా పునరుద్ధరణ ప్రారంభమవుతుంది.
7. మీ పాత ఫోన్ లో ఏదైతే గూగుల్ అకౌంట్ వాడారో అదే అకౌంట్ తో కొత్త ఫోన్ లో కూడా సైన్ ఇన్ అవ్వాలి.
8. డేటా రీస్టోర్ అయిన తర్వాత ' నెక్స్ట్' పై క్లిక్ చేయండి.
9. ఇప్పుడు ' ప్రొఫైల్ ఇన్ఫో' విండో లో మీ పేరుని టైప్ చేయండి.
10. మీ పాత వాట్సాప్ లో ఉన్న డేటా బ్యాక్అప్ పూర్తికావడానికి.. కొన్ని నిముషాల/ గంటల సమయం పడుతుంది.
మీ అన్ని పాత మెసేజ్ పునరుద్ధరించబడ్డాయి.








































Comments
Post a Comment