Free Online Training of Upcomming Govt Jobs | How to join the classes and get more Details here..
ప్రభుత్వ ఉద్యోగాలకు - ఉచిత ఆన్లైన్ శిక్షణ తరగతులు..
పోలీస్, ఆర్ ఆర్ బి బ్యాంక్ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఉచితంగా ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్నామని ఆర్.బి ఇన్స్టిట్యూషన్ సంత డైరెక్టర్ సుదర్శన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పది రోజులపాటు ప్రతిరోజూ ఉదయం 06:00 గంటల నుండి 7:30 వరకు. అలాగే సాయంత్రం 06: 30 నిమిషాల నుండి రాత్రి 8 గంటల వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నామన్నారు.. వివరాలు ఆన్లైన్ క్లాస్ రూమ్ లింక్ కోసం ఈనెల 12వ తేదీలోపు 756950313 ఫోన్ నెంబర్ కు సంప్రదించాలని పేర్కొన్నారు.. 13 నుండి క్లాసులు ప్రారంభం అవుతున్నాయి అన్నారు..
సైన్యంలో అమ్మాయిలకు గ్రీన్ సిగ్నల్..
రక్షణ దళాల ఉన్నతాధికారులు నిర్ణయం..
సుప్రీం కోర్టుకు వెల్లడించిన కేంద్రం..
అఫిడవిట్ దాఖలు కు సమయం కావాలి..
ఈ ఏడాదికి యధాతథంగా పరీక్ష..
అనుమతించాలని కోరినా ప్రభుత్వం...
సైన్యం లో అమ్మాయిల ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్:
💧 సాయుధ బలగాలు లో చేరడానికి ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అమ్మాయిలకు రక్షణ దళాలు ఇకనుంచి స్వాగతం పలకనున్నాయి.
💧 ఈ మేరకు ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం బుధవారం(08.09.2021) ప్రకటించింది.
💧 నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్ డి ఏ)
💧 నేవల్ అకాడమీ(ఎన్ ఎ).. లో ప్రవేశం, శిక్షణ కోసం అమ్మాయిలను కూడా అనుమతించనునట్లు పేర్కొన్నది.
💧 ఇప్పటివరకూ ఇంటర్ చదివిన, పెళ్ళికాని అమ్మాయిలు మాత్రమే వీటిలో ప్రవేశానికి అర్హులు.
💧 అయితే ఈ నిబంధన వల్ల అమ్మాయిలు అవకాశాలు కోల్పోతున్నారని, ఇది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని పేర్కొంటూ కుష్ కల్రా అనే న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
💧 అమ్మాయిలను కూడా ఎన్ డి ఏ, ఎన్ ఏ పరీక్షలకు అనుమతించేలా యూపీఎస్సి ని ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు.
💧 గత నెలలో దీనిపై విచారణ జరిపిన కోర్టు.... ఆయా పరీక్షలకు అమ్మాయిలను అనుమతించాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది..
💧 ఈ విషయంపై బుధవారం(08.09.2021) సుప్రీం కోర్టులో మళ్లీ విచారణ జరిగింది. అమ్మాయిలను ఎన్ డి ఏ, ఎన్ ఏ విభాగాల్లోకి అనుమతించాలని డిఫెన్స్ ఫోర్స్ కు చెందిన ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా కేంద్రం కోర్టుకు తెలిపింది. దీనిపై విధివిధానాలను రూపొందించాలని అఫిడవిట్ దాఖలు చేయడానికి కొంత సమయం పడుతుందని తెలిపింది...
వారం రోజుల్లో డైట్-సెట్ ఫలితాలు..
డిప్లమా ఇన్ ఎలిమెంటరీ, డిప్లమా ఇన్ ఫ్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన డైట్-సెట్ ఫలితాలను వారం రోజుల్లో ప్రకటించనున్నట్లు సెట్ కన్వీనర్ శ్రీనివాసచారి తెలిపారు. బుధవారం(08.09.2021) నిర్వహించిన ఈ పరీక్ష కు 5,818 ఎనిమిది మంది విద్యార్థులు హాజరు అయినట్లు ఆయన తెలిపారు. కాగా రాష్ట్రంలో, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని పబ్లిక్ లైబ్రరీ డైరెక్టర్ ప్రకటించారు.. తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో కలిపి మొత్తం 240 సీట్లు ఉన్నాయని ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్లు ఈ కోర్సుకు అర్హులని, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల (సెప్టెంబర్) 17 నుండి 23వ తేదీ మధ్య దరఖాస్తులు పంపించాలని తెలిపారు...
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here








































Comments
Post a Comment