ITI 3rd Spell admission date is Extended | Check eligibility and register online to give web option | and more details read here..
ఐటిఐ ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు:
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా ప్రభుత్వ ప్రైవేటు ఐటిఐ కళాశాలలో మూడవ విడత సీట్ల కేటాయింపు ప్రకటన వెలువడిన విషయం అందరికి తెలిసిందే, అయితే దరఖాస్తు గడువును ఈనెల 28వ తేదీ నుండి 30 వరకు అభ్యర్థులకు దరఖాస్తులకు అవకాశాన్ని కల్పించింది. 8, 10వ తరగతి పాసైనా విధ్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు..
ఈ విషయాన్ని మహబూబాబాద్ ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ వి. రాధాకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ఆయన ఈ ప్రకటనలో తెలిపారు. మొదటి, రెండవ విడతల్లో సీట్లు రానివారూ మూడవ విడతలో దరఖాస్తుల కోసం వెబ్ ఆప్షన్ ను ఇస్తే సరిపోతుందని ఆయన సూచించారు..
దీని కోసం అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి, రిజిస్ట్రేషన్ చేసుకునే వెబ్ ఆప్షన్ ను ఇవ్వాలని, సంబంధిత రిజిస్ట్రేషన్ ఫామ్ ను ప్రింటవుట్ తీసుకుని భద్రపరచుకోవాలి.
ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, మరియు వివరాలకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలను సంప్రదించాలని ఆయన గారు సూచించారు.
అదేవిధంగా మంచిర్యాల విద్య విభాగంలోనే ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ చందర్, దేవానంద్ కూడా ఐ టి ఐ దరఖాస్తుల గడువు పెంపునకు మంచిర్యాల, మందమర్రి ప్రభుత్వ ఐటిఐ కళాశాల లో ప్రవేశాలకు మూడవ విడత సీట్ల కేటాయింపు లో భాగంగా దరఖాస్తుల గడువు పెంచారని ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 28 నుండి 30వ తేదీ వరకు ఆన్లైన్ వెబ్ ఆప్షన్ లను నమోదు చేసుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
దీనికి సంబంధించిన వివరాలను పూర్తిగా తెలుసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ప్రస్తుతం వెబ్ ఆప్షన్ ను నమోదు చేసుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు.
4వవిడత ఆన్లైన్ దరఖాస్తులు మరియు వెబ్ ఎంపికలకు చివరితేది :: 30.11.2021
వెబ్సైట్ చిరునామా https://iti.telangana.gov.in
మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి..
& రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Post a Comment