MIDHANI Recruitment 2021 || మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్, హైదరాబాద్ నుండి భారీ వేతనముతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన || అర్హత ప్రమాణాలను ఇక్కడ తనిఖీ చేయండి.
హైదరాబాద్‌లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన, మినీ రత్న కంపెనీ అయినటువంటి మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని).. వీటితో ఖాళీల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ పౌరులు నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 12,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు.
1. అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)- 2,
2. మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) - 4,
3. డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) -1.. ప్రకటించారు.
విద్యార్హత:
పోస్టులను అనుసరించి, సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్ విద్యార్హత కలిగి, సంబంధిత పనిలో కనీసం 2-13 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయసు:
పోస్టులను అనుసరించే అభ్యర్థుల వయస్సు నవంబర్ 10, 2021 నాటికి 30-45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
జీతాల వివరాలు:
1. అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రూ.9.0 - 31.60 లక్షల వరకు ప్రతి సంవత్సరం జీతంగా చెల్లిస్తారు.
2. మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రూ.13.50 - 40.70 లక్షల వరకు ప్రతి సంవత్సరం జీతంగా చెల్లిస్తారు.
3. డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రూ.18.0 - 49.70 లక్షల వరకు ప్రతి సంవత్సరం జీతంగా చెల్లిస్తారు.
ఇతర అర్హత ప్రమాణాలు:
★ భారతీయ పౌరులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
★ విద్యార్హత, వయస్సు, అనుభవం, మొదలగు విషయాలను నవంబర్ 10 2020 నాటికి పరిగణలోకి తీసుకుంటారు.
★ అధిక వ్యాసాలు కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు వర్తిస్తాయి.
ఎంపిక విధానం:
ఈ మూడు రకాల పోస్టులకు ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు..
దరఖాస్తుల సంఖ్య అధికంగా ఉన్నట్లు అయితే రాత పరీక్షలు నిర్వహించి ఎంపిక చేపడతారు.
రాత పరీక్ష ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులు రూ.100/-.
ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి వర్గాల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
★ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
★ అధికారిక వెబ్ సైట్ లింక్: https://midhani-india.in/
★ మెయిన్ మెనూ లో కనిపిస్తున్న కెరియర్ లింక్‌పై క్లిక్ చేయండి.
★ కెరియర్ పేజీ ఓపెన్ అవుతుంది.. అక్కడే కనిపిస్తున్న ఈ రిక్రూట్మెంట్ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తులను సమర్పించండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.11.2021 నుండి
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 24.11.2021.
అధికారిక వెబ్సైట్: https://midhani-india.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్ & https://midhani-india.in/
Comments
Post a Comment