TS DC Guest Lecturer Recruitment 2021 | Online Apply 1138 Various Discipline | Check District wise vacancies and Eligibility Criteria here.. @elearningbadi.in
తెలంగాణ డిగ్రీ కాలేజ్ గెస్ట్ లెక్చరర్ నియామకాలకు ప్రకటన:
తెలంగాణ డిగ్రీ కాలేజ్ Guest Lecturer నియామకాలకు సంబంధించిన ఖాళీల వివరాలను ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఇందులో మొత్తం 28 విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయని, తెలంగాణలోని 33 జిల్లాల్లోని డిగ్రీ కళాశాలలో కలిపి 1138 పోస్టులను ఈ నియామకాల లో భాగంగా ప్రకటించింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య : 1138.
జిల్లాల వారీగా ఖాళీల వివరాలు:
1. అదిలాబాద్ - 22,
2. భద్రాద్రి కొత్తగూడెం - 29,
3. హైదరాబాద్ - 196,
4. జగిత్యాల - 12,
5. జనగామ - 81,
6. జయశంకర్ భూపాలపల్లి - 10,
7. జోగులాంబ - 44,
8. కామారెడ్డి - 31,
9. కరీంనగర్ - 45,
10. ఖమ్మం - 38,
11. కొమరం భీమ్ ఆసిఫాబాద్ - 19,
12. మహబూబాబాద్ - 19,
13. మహబూబ్నగర్ - 79,
14. మంచిర్యాల - 21,
15. మెదక్ - 26,
16. మేడ్చల్ మల్కాజ్గిరి - 29,
17. ములుగు - 4,
18. నాగర్ కర్నూల్ - 41,
19. నల్లగొండ - 77,
20. నారాయణపేట - 23,
21. నిర్మల్ - 7,
22. నిజామాబాద్ - 54,
23. పెద్దపల్లి - 15,
24. రాజన్న సిరిసిల్ల - 9,
25. రంగారెడ్డి - 33,
26. సంగారెడ్డి - 64,
27. సిద్దిపేట - 66,
28. సూర్యాపేట -5,
29. వికారాబాద్ - 40,
30. వనపర్తి - 33,
31. వరంగల్ - 8,
32. వరంగల్ అర్బన్ మరియు - 23,
33. యాదాద్రి భువనగిరి - 8.. ఇలా మొత్తం 1138 డిగ్రీ కాలేజ్ అధ్యాపకులకు సంబంధించిన ఖాళీల వివరాలను ప్రకటించింది..
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకుల కొరత సమస్యలను నివారించడానికి విద్యాసంవత్సరం 2021 22 కు గాను 1138 గెస్ట్ లెక్చరర్లను నియమించాలని ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు ఖాళీలను పై విధంగా ప్రకటించారు.
ఈ ఖాళీలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది..
నోటిఫికేషన్ పూర్తి వివరాలు & దరఖాస్తు విధానం వీడియొలో..
విద్యార్హత: ఈ పోస్టులకు నెట్, పీహెచ్డీ విద్యార్హత కలిగి ఉన్న వారికి ప్రధమ ప్రాధాన్యత ఇస్తూ.. వారు దొరకని పక్షంలో పి.జి పూర్తి చేసిన వారికి అవకాశం ఇవ్వనున్నట్లు విద్యాశాఖ అధికారులు విద్యా ప్రమాణాలను నిర్ణయించారు.
విభాగాల (సబ్జెక్ట్ ల) వారీగా ఖాళీల వివరాలను తెలుసుకోవడానికి అధికారిక గెస్ట్ ఫ్యాకల్టీ అలాట్మెంట్ పిడిఎఫ్ ను ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
ఇలాంటి తాజా విద్యా ఉద్యోగ సమాచారం కోసం మా వెబ్సైట్ ను https://www.elearningbadi.in/ సందర్శించండి.
ఎప్పటికప్పుడు తాజా వివరాలను తక్షణం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి..
Comments
Post a Comment