VTG CET - 2022 | తెలంగాణ 5వ తరగతి ఉమ్మడి ప్రవేశ పరీక్ష - 2022 | మోడల్ పేపర్ విశ్లేషణ | Don't miss.. @elearningbadi.in
తెలంగాణ 5వ తరగతి ఉమ్మడి ప్రవేశ పరీక్ష - 2022 మోడల్ పేపర్ విశ్లేషణ
1) లక్ష్మీ తెలివైన బాలిక, ఆమె రోజు కథల పుస్తకాలు చదువుతుంది. ఈ వాక్యం లో గీత గీసిన పదం
A) నామవాచకం
B) సర్వనామం
C) విశేషణం
D) క్రియ
2) నాన్న పొలం నుంచి వచ్చాడు. ఈ వాక్యంలో క్రియ పదం?
1) నాన్న
2) పొలం
3) నుంచి
4) వచ్చాడు
3) రాజు బడికి వెళ్ళాడు. అతడు ఆటలు ఆడాడు. ఈ వాక్యంలో అతడు అనగా?
1) ఆటలు
2) బడి
3) రాజు
4) ఆడటం
4)క్రింది పదాలలో నామవాచకం ఏది?
1) వాణి
2) ఆమె
3) అతడు
4) మంచి
5) క్రింది వాక్యాలలో విశేషణం లేని వాక్యం
1) రామప్ప చెరువు చాలా పెద్దగా ఉన్నది..
2) వినయ్ వచ్చాడు.
3) గోల్కొండ కోట విశాలంగా ఉన్నది.
4) A మరియుC
6) ఆకుపచ్చ లైటు వెలిగింది. దీంట్లో విశేషణం ఏది?
1) లైటు
2) వెలిగింది
3) ఆకుపచ్చ
4) ఆకు
7) తెలంగాణ పరాక్రమాన్ని రుద్రమ్మదేవి చాటింది. ఈ వాక్యం ఏ కాలానికి చెందినది?
1) భూతకాలం
2) భవిష్యత్ కాలం
3) వర్తమాన కాలం
4) వర్షాకాలం
8) తల్లి తన పిల్లల్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతుంది. ఈ వాక్యంలో అవ్యయం ఏది?
1) తల్లి
2) పిల్లలు
3) అను
4) లా
9) కింది పదాలలో జంటపదం కానిది?
1) వెలుగునీడలు
2) వాగు వంకలు
3) ధరిత్రి
4) నింగి నేల
10) ద్విత్వాక్షరం ఉన్న పదం
1) తర్కము
2) సర్వస్వము
3) లక్ష్యము
4) అన్నయ్య
11) ఉభయాక్షరం కానిదేదీ?
1) మ
2) :(విసర్గ ః)
3) అరసున్న
4) సున్న(౦)
12) హేమంతో చేసిన నగలు అందరూ ఇష్టపడతారు. గీత గీసిన పదానికి అర్థం ఏమిటి?
1) మంచు
2) వెండి
3) రాగి
4) బంగారం
13) క్రింది పదాల వరుసలో ఒక పదం వేరుగా ఉంది. ఆ పదం ఏది?
1) భూతకాలం
2) భవిష్యత్ కాలం
3) వర్తమాన కాలం
4) కలికాలం
14) అష్టాదశ పురాణాలు అనగా ఎన్ని పురాణాలు?
1) 8 పురాణాలు
2) 80పురాణాలు
3) 10 పురాణాలు
4) 18 పురాణాలు
అ) క్రింది పద్యాన్ని చదవండి. ఈ ప్రశ్నలకు సరైన జవాబు గుర్తించండి.
ఉపకారికి నుపకారము
విపరీతము కాదు సేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!
15) పై పద్యంఏ శతకంలోనిది?
1) కుమార శతకం
2) సుమతి శతకం
3) వేమన శతకం
4) భాస్కర శతకం
16) 'ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ.' ఈ పద్యానికి అర్థం ఏమిటి?
1) మనకు కీడు చేసిన వారికి మేలు చేయడం గొప్ప
2) మనకు మేలు చేసిన వారికి మేలు చేయడం గొప్ప
3) మనకు మేలు చేసిన వారికి మేలు చేయడం గోప్పేం కాదు
4) మనకు కీడు చేసిన వారికి మేలు చేయడం అసలు గొప్పే కాదు
17) నెపము అనగా
1) ఒప్పు
2) మంచి
3) చెడు
4) తప్పు
ఆ) ఈ క్రింది పేరా చదవండి. ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించండి.
మానవులకు ఎంతమాత్రం దయాదాక్షిణ్యాలు లేవు. మనం వీళ్లకు నీడ, పూలు, పండ్లు, ఆకులు, ఆహారాన్ని ఇస్తున్నాం. అయినా ఇంత నన్న కనికరం లేదు. మనం చిన్నగున్నప్పుడే తొక్కుకుంట నడుస్తారు. ఎప్పుడైనా బుద్ధి పడితే నాటుతారు. రోజు ఇన్ని నీళ్లయినా పోయారు. మనను కాపాడుకుందామని ఇంత ప్రయత్నమన్నా చేయరు. మనతోనే గదా! ఈ భూమి పచ్చగా, అందంగా చూడ సక్కంగా ఉంటున్నది. అవసరాల కోసమయితే విచక్షణ రహితంగా మనని నరికేస్తారు గాని మనని నాటాలని గాని. పెంచాలని గాని ఇంతనన్న ఆలోచించరు. మనం లేకుంటే వాళ్లు భవిష్యత్తులో ఎన్ని కష్టాలు పడుతారో. వీళ్లను చూస్తే జాలేస్తున్నది. వీళ్లు మనలను నాటకున్నా, పెంచకున్నా అడవుల్ల పెరుగుతున్న మనల్ని రోజు రోజుకి నరికేస్తున్నారు. తమ ముప్పును తామే కొని తెచ్చుకుంటున్నారు.
18) పై పేరా ఆధారంగా ఎవరికి దయాదాక్షిణ్యాలు లేవు?
1) చెట్లకు
2) మానవులకు
3) నీళ్లకు
4) అడవులకు
19) భూమి పచ్చ గా ఉండటానికి కారణం
1) మానవులు నివసించడం
2) మానవులు, జంతువులు నివసించడం
3) అడవులు ఉండటం వలన
4) అడవులను నరికి వేయడం వలన
20) 'మనం లేకుంటే వాళ్లు భవిష్యత్తులో ఎన్ని కష్టాలు పడతారో.' అని ఎవరు, ఎవరితో అన్నారు?
1) మానవులు ,వృక్షాలతో
2) వృక్షాలు, అడవితో
3) వృక్షాలు, వృక్షాలతో
4) అడవి, మానవునితో
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment