IOCL Recruitment 2022 | Diploma/ B.Sc Candidates Can Apply Online | Check Salary & Selection Procedure here..
నిరుద్యోగులకు శుభవార్త!
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకానికి, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతూ, అధికారికంగా నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థులు ఈ నెల 7వ తేదీ నుండి ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మే 28 గా నిర్ణయించారు. విభాగాల వారీగా ఖాళీలు, విద్యార్హత, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలను మొదలగు పూర్తి సమాచారం మీకోసం. తాజా విద్య ఉద్యోగ సమాచారం కోసం elearningbadi.in వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) పానిపట్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్స్ లో ఖాళీగా ఉన్న నాన్న ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 19.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు(ప్రొడక్షన్) - 18,
◆ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్(ఇన్స్ట్రుమెంటేషన్) - 01.
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మూడు సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లమా/ బీఎస్సీ అర్హతతో సంబంధిత పనిలో కనీసం సంవత్సరం అనుభవం ఉండి టెక్నికల్ నాలెడ్జ్ ని కలిగి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
వయసు: ఏప్రిల్ 30, 2022 నాటికి 18 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల మధ్య ఉండాలి.
అధిక బయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/ ఎఫిసీఎన్సీ / ఫిజికల్ టెస్ట్ ల ఆధారంగా నిర్వహిస్తారు.
జీతం: పే స్కేల్ ₹.25,000 - 1,05,000/- ప్రకారం ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.05.2022 నుండి..
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 28.05.2022.
హార్డ్ కాపీలు పంపించడానికి చివరి తేదీ: 19.06.2022.
అధికారిక వెబ్సైట్: https://iocl.com/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు :: ఇక్కడ క్లిక్ చేయండి.
◆ ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ ను పొందడానికి మా వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.
Comments
Post a Comment